HomeNewsBreaking Newsఏడాది తర్వాత నక్సల్స్‌ కదలికలు

ఏడాది తర్వాత నక్సల్స్‌ కదలికలు

నెల్లిపాకలో మావోయిస్టు బ్యానర్లు
యాక్షన్‌ టీంలు వచ్చాయంటూ ప్రచారం
31న బంద్‌కు పిలుపు
ఖమ్మం బ్యూరో: గోదావరి అవల భద్రాచలం, భూపాలపల్లి డివిజన్లకే పరిమితమైన మావోయిస్టు కార్యకలాపాలు ఏడాది తర్వాత మళ్లి గోదావరి ఇవతల మణుగూరు సబ్‌ డివిజన్‌లో మొదలయ్యాయి. సరిగ్గా ఏడా ది క్రితం మావోయిస్టులు పినపాక మండలం భూపతిరావు పేటలో వాహనాలను తగలబెట్టడమే కాకుండా మడకం జోగయ్య అనే వ్యక్తిని ఇన్ఫార్మర్‌ నెప ంతో హత్య చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అశ్వాపురం మండలం మొండికుంట, నెల్లిపాక గ్రామాల మధ్య మావోయిస్టు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్‌ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫ్లెక్సీలు వెలవడం చర్చకు దారితీసింది. గతేడాది సుజాత కార్యదర్శిగా మణుగూరు, పాల్వంచ ఏరియా కమిటీని మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసింది. సుజాత నేతృత్వంలో గోదావరి ఇవతల ప్రధానంగా మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాల్లో మావోయి స్టు పార్టీ విస్తరణ కార్యక్రమాలు జరిగాయి. పాల్వంచ కేంద్రంగా కొత్త క్యా డర్‌ రిక్రూట్‌ జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. మూడు నెలల క్రితం సుజాత పోలీసులకు పట్టుబడింది. దీంతో ఈ ప్రాంతంలో కార్యకలాపాలకు చెక్‌ పడిందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అశ్వాపురం మండలం లో ఫ్లెక్సీలు కన్పించడంతో మళ్లీ మావోలపై ఈ ప్రాంతంలో చర్చ ప్రారంభమైంది. పోలీసులు గ్రీన్‌ హాంట్‌ దళాలు, ఇంకా కేంద్ర బలగాలు పనిచేస్తున్నా భద్రాచలం డివిజన్‌ చత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఆగడం లేదు. హింసాత్మక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రెషర్‌ బాంబులు పేల్చడం, వాహనాలను తగలబెట్టడం, ఇన్ఫార్మర్ల పేరుతో కొందర్నీ హతమార్చడం చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ తన బలగాలను పెద్ద సంఖ్యలో కోల్పోయింది. మావోయిస్టు అధికారిక లెక్కల ప్రకారమే 2017 మే నుండి 2018 డిసెంబరు వరకు 196 మంది విప్లవకారులను, 95 మంది సానుభూతిపరులను హతమార్చినట్లు తెలుస్తుంది. ఇంత జరిగిన దండకారుణ్యంలో పోలీసులు మాత్రం పై చేయి సాధించలేకపోయారు. గిరిజనుల మద్దతు మావోయిస్టులకే లభిస్తుండడం గమనార్హం. 2017లో గ్రీన్‌ హాంట్‌తోపాటు సమాధాన్‌ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతకు కేంద్రం ఒక వ్యూహాం రచించింది. ఇందు కోసం ఐదున్నర లక్షల మంది పారా మిలటరీ కమాండో బలగాలను కేటాయించారు. వారు వీలైనంత మేర మావోయిస్టు కార్యకలాపాల ను అణచివేసేందుకు ప్రయత్నాలు జరిగిన అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా దళాలకు కొత్తగా శారద కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె ఆధ్వర్యంలో ఆపరేషన్‌ సమాధాన్‌ కు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించాలని ఈనెల 31న బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మణుగూరు ప్రాంతంలో మావోయిస్టుల బంద్‌ పిలుపు ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధానంగా అశ్వారావుపేట, మణుగూరు బిటిపిఎస్‌లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే నెపంతో పుకార్లు వినవస్తున్నాయి. మణుగూరు ప్రాంతంలో రెండు యాక్షన్‌ టీంలు పనిచేస్తున్నాయని వాటి వల్ల కొంత మందికి ముప్పు వాటిల్లనున్న దన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక అర్బన్‌ ప్రాంతంలో మావోయిస్టు రిక్రూట్‌మెంటు జరుగుతున్నదన్న దానిపై కూడా చర్చ సాగుతుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితులపై విరక్తి చెందిన యువతను తమ వైపుకు తిప్పుకునేందుకు కొందరు పట్టణ ప్రాంతాలు కేంద్రంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుం ది. నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలుగా చూపి రిక్రూట్‌మెం టు చేస్తున్నారు. భద్రాచలం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతుండడంతో ఇప్పుడు రిక్రూట్‌మెంటు చేసిన వారిని మణుగూరు ప్రాంతం ద్వారా చత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో శిక్షణకు పంపిస్తున్నారు. ఇటీవల కాల ంలో పలువురు ఈ కోవాలోనే పట్టుబడడం విధితమే. 30 ఏళ్ల తర్వాత మావోయిస్టు కార్యకలాపాలు గోదావరి ఇవతల ప్రారంభం కావడం యాక్షన్‌ టీంలు వచ్చాయన్న ప్రచారం ఈ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వారం రోజులపాటు జరిగే ఆందోళనలు, బంద్‌ రోజు హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. గతేడాది జనవరి 26న రాత్రి మణుగూరు సబ్‌ డివిజన్‌లోని పినపాక మండలం భూపతిరావుపేట గ్రామంపై 70 మందికి పైగా సాయుధ మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. వాహనాలను దగ్ధం చేశారు. ఒక వ్యక్తిని హత్య చేసి మరొకర్నీ తీవ్ర ంగా గాయపర్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వారంతా మైదాన ప్రాంతానికి చెందిన వారిగా పేర్కొనడంతో సాయుధ దళాల్లో కొత్తగా చేరిన వారిగా అనుమానించారు. ఇలోపు సుజాత అరెస్టు కావడం తదితర కారణాలతో కొద్దికాలం మావోయిస్టు కార్యకలాపాలకు తెరపడింది. మళ్లీ ఇప్పుడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాలు ఏ పరిస్థితికి దారి తీస్తాయోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీస్‌ అధికారులు మాత్రం మావోయిస్టు కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments