HomeNewsBreaking Newsమెజారిటీ ప్రజలకు ప్రగతి దూరం

మెజారిటీ ప్రజలకు ప్రగతి దూరం

రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేయాలి
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సురవరం పిలుపు
హైదరాబాద్‌: దేశం అనేక రకాలు గా అభివృద్ధి సాధించినప్పటికీ దేశంలోని మెజారిటీ ప్రజలకు అది చేరలేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అ న్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మ న దేశం సాధించిన ప్రగతి, సైనికపాటవం గు రించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. 70వ భారత గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మఖ్దూంభవన్‌లో జరిగిన పతావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొ ని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా సంపద కొద్దిమంది చేతుల్లో పోగుబడుతుందని అంశా న్ని ఆక్స్‌ఫాం సంస్థ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు దృష్టికి తెచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశంలో 2018లో 39శాతం సం పద వృద్ధి కేవలం ఒక్క శాతం ప్రజల చేతిలో పో యిందని, 9 కుటుంబాల చేతిలో ఉన్న సంపద దేశంలో ఉన్న 50శాతం ప్రజల సంపదకు స మానంగా ఉందని వివరించిందని, ఈ ఒక్క సం వత్సరంలోనే దాదాపు 35 కోట్ల ప్రజల జీవన ప్రమాణాలు 11 శాతం తగ్గాయని వెల్లడించిందని తెలిపారు. దేశాభివృద్ధి అంటే దేశంలో గ ణాంకాల అభివృద్ధి కాదని, మానవ అభివృద్ధి సూచికే నిజమైన దేశాభివృద్ధికి సూచికగా చూ డాలన్నారు. మైనారిటీలు, దళితులు, దేశంలో తీవ్రమైన అభద్రతా భావంతో భయానక పరిస్థితిలో ఉన్నారని, ఈ పరిస్థితిలో 2019 సాధా రణ ఎన్నికలు జరుగబోతున్నాయని చెప్పారు. మతోన్మాదాన్ని, ఆసహనాన్ని, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్రలను ఓడించే పద్ధతిలో ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు చెబుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ రకమైన లక్ష్య సాధనకు కృషిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు తీ వ్రమైన భయాందోళనలు కల్గిస్తున్నప్పటికీ ఉద్యమాలకు, పోరాటాలకు, పునరాలోచనలకు స మయమిదేనని అన్నారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం : చాడ
రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత గత 25, 30 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే ప్రజాస్వామ్య విలువలు పాతరవేయ బడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్స వం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి న అనంతరం ఆయన ప్రసంగించారు. నేడు ప్ర జాస్వామ్యం ప్రమాదంలో పడిపోతోందని, రా జ్యాంగంలో పొందుపరిచిన లౌకిక వ్యవస్థకే ఆ టుపోట్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్య క్తం చేశారు. రాజ్యాంగ పరంగా స్వతంత్ర వ్యవస్థలన్నీ పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నాయని విమర్శించారు. దేశంలో పేదరి కం ఇప్పటికి 53 శాతం కంటే ఎక్కువ ఉందని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రా జ్యాంగ స్పూర్తిని మరోకసారి మనం చర్చనీయాంశంగా ప్రజల్లోకి తీసుకోపోవాల్సిన అవస రం ఉందని సూచించారు. రాజ్యాంగం పొందుపరిచిన ప్రాథమిక హక్కులు సైతం ప్రజలకు అందట్లేదని, హక్కులు హరించబడుతున్నాయని అన్నారు. ఓటరు నమోదులోనే తప్పులు జురుగుతున్నాయని, ప్రతిఒక్కరికి ఓటు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వంపై ఉందని అయితే లక్షల ఓట్లు గల్లంతైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉండే ప్రతి పౌరుడు రాజ్యాంగ ఉల్లంఘనలు వ్యతిరేకిస్తూ, సెక్యులరిజాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రత్యేక ఉద్యమాలకు, ప్రజల్లో చైతన్యానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, ఉజ్జినిరత్నాకర్‌ రావు, ‘ప్రజాపక్షం’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ రెడ్డి, టి.వెంకట్రాములు, డా. డి.సుధాకర్‌, రాష్ట్రసమితి సభ్యులు ప్రేంపావని, అంజయ్య నా యక్‌, బి.వెంకటేశం, ప్రజానాట్యమండటి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మినారాయ ణ, పల్లె నర్సింహ, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అశోక్‌ స్టాలిన్‌, శివరామకృష్ణ, ఎఐటియుసి నాయకులు కర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments