మలయాళం సినిమాని తెలుగులో నాగచైతన్య చేసిన ప్రేమమ్ సినిమాగా రీమేక్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఈ సినిమా మలయాళంలో సూపర్, డూపర్ హిట్ కొట్టింది. యూత్ మొత్తం ఈ సినిమాకి అఖండమైన విజయాన్ని చేకూర్చారు. పెద్ద స్టార్ హీరో నుంచి, చిన్న ఆర్టిస్ట్ వరకు అందరి నోట్లో నుంచి ఈ సినిమా డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రెన్ పేరు వినబడేది.
తెలుగులో ఈ సినిమా అంత హిట్ అవ్వలేదు. ఈ సినిమాపై అక్కినేని ఫాన్స్, అక్కినేని ఫ్యామిలీ కూడా చాలా అంచనాలను పెట్టుకున్నారు గాని, అంత స్థాయికి సినిమా రీచ్ కాలేదు. అయతే వరస ఫ్లాప్స్ తో బాధపడతున్న చైతూ కు ఈ సినిమా కొత్త చేయూతని ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీ లో రీమేక్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు.
ఈ సినిమాని రీమేక్ చేయడానికి చాలా కంపెనీలు ముందుకు వచ్చాయంట. వాళ్ళ చేతిలో మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారని, సినిమా రైట్స్ ఇమ్మని అడిగారంట. కాని ఆల్ఫోన్స్ పుత్రెన్ ఎవ్వరికి ఎస్ చెప్పలేదంట. ఆల్ఫోన్స్ దీని గురించి తన ఫేస్ బుక్ లో ప్రస్తావిస్తూ… ప్రేమమ్ సినిమాని రీమేక్ నిజాయితీగా చేయాలి అంటే ఆ దర్శకుడు 31 ఏళ్ళ లోపు వాడు అయ్యుండి వర్జిన్ కూడా అయితేనే ఇందులో స్వచ్చతని అచ్చంగా చూపగలడని ఛాలెంజ్ విసిరాడు. తనను తీస్తామని చెప్పిన వాళ్ళంతా కమర్షియల్ సినిమాకు కట్టుబడి వయసు మీరిన వాళ్ళు అని చెప్పాడు. బహుసా అందుకే తెలుగులో అంత హిట్ అవ్వలేదేమో!