వాషింగ్టన్: మన భూగ్రహంపై ఒక రోజు అంటే 24 గంట లు. సంవత్సరం అంటే 365 రోజులు. ఈ సమయం భూమి సూర్యుని చుట్టూ తిరిగే దాన్ని బట్టి నిర్ధారణ అయింది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి (భూభ్రమణం) 24 రోజుల సమయం పడుతుంది. అలాగే సూర్యుని చుట్టూ తిరగడానికి (భూపరిభ్రమణం) 365 రోజులు సమయం పడుతుంది. అయితే కాస్త హెచ్చుతగ్గుల కారణంగా నాలుగేళ్లకోసారి 366 రోజులు సమయం పడుతుంది. సౌర వ్యవస్థలో ఉన్న ఇతర గ్రహాల భ్రమణ, పరిభ్రమణ సమయాలను కూడా శాస్త్రవేత్తలు నిర్ధారిస్తూ వచ్చారు. కొన్ని గ్రహాల సమయాన్ని అటుఇటుగా చెప్పినా, సరైన సమయాలను నిర్ధారణ చేయడానికి కాస్త సమయమే పడుతోంది. అందులో భాగంగా శని గ్రహంపై ఒక రోజు ఎంత అన్న రహస్యాన్ని తాజాగా శాస్త్రవేత్తలు ఛేదించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాంటా క్రజ్కు చెందిన సైంటిస్టులు కేసినీ శాటిలైట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శని గ్రహంపై ఒక రోజు అంటే సరిగ్గా 10 గంటల 33 నిమిషాల 38 సెకన్లుగా తేల్చారు. ఇక మన భూమిపై 29 ఏళ్లు గడిస్తే శనిగ్రహంపై ఒక ఏడాది పూర్తవుతున్నట్లుగా భావించాల్సి వుంటుంది.
శనిగ్రహంపై రోజుకు 10 గంటలే!
RELATED ARTICLES