అక్లాండ్: ఆస్ట్రేలియా పర్యటనను విజవంతంగా పూర్తి చేసిన టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌కు చేరుకుంది. భారత ఆటగాళ్లు ఆక్లాండ్ ఏయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వీడియోను బిసిసిఐ తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇక్కడ న్యూజిలాండ్‌లో భా రత్ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. బుధవారం అక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన కోహ్లీ సేనకు కివీస్‌లో అసలైన పరీక్ష జరగనుంది. ఆస్ట్రేలియాతో పోలిస్తే ప్రస్తుత కివీస్ జట్టు పటిష్టంగా ఉంది. న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కివీస్ జట్టుకు ఎదురులేదు. గత కొంతకాలంగా న్యూజిలాండ్ జట్టు అద్భుత విజయాలతో ఆకట్టుకొంటుంది. అలాంటిది ఇప్పుడు వారిని వారి సొంతమైదానాల్లో ఓడించడం కోహ్లీ సేనకు పెద్ద సవాలే. ఇటివలే శ్రీలంకతో జరిగిన టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లను గెలుచుకొని న్యూజిలాండ్ సత్తా చాటుకుంది. లంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కివీస్ 3 క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌నూ సైతం గెలుచుకొని జోరు కనబరిచింది. ఇప్పుడు భారత్ సవాల్‌కు సిద్ధమయింది. భారత జట్టు కూడా ఆసీస్‌ను ఓడించి మంచి ఫామ్‌లో ఉంది. అదే జోరును కివీస్‌లో కూడా కొనసాగించాలని తహతహలాడుతోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో వీరిద్దరి మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
న్యూజిలాండ్ చేరుకున్న టీమిండియా
RELATED ARTICLES