సిఎల్‌పి నేత భట్టివిక్రమార్క డిమాండ్
పక్షానికోసారి కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
రాష్ట్ర సమస్యలపై చర్చిస్తామని వెల్లడి
ప్రజాపక్షం/ హైదరాబాద్ : ప్రతి 15 రోజులకు లేదా నెలకు ఒకసారి సిఎల్‌పి సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చిస్తామని ప్రతిపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో సిఎల్‌పి సమావేశమవుతామని, పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలోనైనా ప్రభుత్వం ఎక్కువ రోజులు సమావేశాలను నిర్వహించాలని కోరారు. సిఎల్‌పి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆత్రం సక్కులతో కలిసి భట్టి విక్రమార్క జర్నలిస్టులతో ఆదివారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రాజెక్టులపై కేటాయించిన నిధులపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. ప్రాజెక్టులను తానే డిజైన్ చేస్తానని కెసిఆర్ అంటున్నారని, ఆయనకు సాంకేతికత గురించి ఎంత వరకు తెలు సో తనకు తెలియదని, దీనిపై నిఫుణుల కమిటీ వేయాలన్నా రు. నిధులను అర్థవంతంగా ఖర్చు పెట్టాలని తాము ప్ర భుత్వాని కోరుతామన్నారు.ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభు త్వం ప్రా జెక్ట్‌ల మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, ఒక్క ఎకరానికైనా సాగునీటిని అందిచ్చారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చుపారుతున్న నీళ్లలో కనబడాలని కానీ, ఎక్కడా కనిపించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల మీద రూ 2.25 లక్షల కోట్ల ఖర్చు ఎక్కడాచూడలేదని,దీనిపై రాష్ట్ర ప్ర భుత్వం రెండవ అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.