ప్రీ క్వార్టర్స్‌లోనే ఇంటికీ..
స్టెఫనొస్ సంచలనం
కెర్బర్, షరపోవా ఔట్
క్వార్టర్స్‌లో నాదల్
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్
మెల్బోర్న్: ప్రతిష్టాత్మాక గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆదివారం సంచలనాలు నమోదయ్యాయి. స్టార్ ఆటగాళ్లను యువ ఆటగాళ్లు నిలువరించి ముందంజ వేశారు. 20 గ్రాండ్‌శ్లామ్‌లు గెలుచుకున్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు ప్రీ క్వార్టర్స్‌లో షాక్ తగిలింది. గ్రీక్ యువ ఆటగాడు స్టెఫనొస్ సిట్సిపాస్ సంచలన విజయంతో డిఫెండింగ్ చాంపియన్ ఫెదరర్‌ను టోర్నీ నుంచి ఔట్ చేశాడు. పురుషుల సింగిల్స్‌లో మరో స్టార్ మారిన్ సిలిక్ కూడా నాలుగో రౌండ్లోనే టోర్నీ నుంచి వైదొలిగాడు. మహిళల విభాగం సింగిల్స్‌లో రెండో సీడ్ కెర్బర్, రష్యా స్టార్ మారియ షరపోవా ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టారు. ఇక స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ మాత్రం అద్భుతమైన విజయంతో దర్జాగా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు.
స్విస్ స్టార్ పరాజయం..
20 గ్రాండ్‌శ్లామ్‌లు గెలుచుకున్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. గత రెండు సీజన్లలో (2017, 2018) విజేతగా నిలిచిన ఫెదరర్ ఈ సారి మూడో, హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేశాడు. కానీ గ్రీక్ యువ ఆటగాడు ఫెదరర్ ఆశలపై నీరుగార్చాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ 7 6 5 6 తేడాతో 14వ సీడ్ స్టెఫనొస్ సిట్సిపాస్ (గ్రీక్) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఒకవైపు 20 ఏళ్ల యువ ఆటగాడు, మరొకవైపు 37 ఏళ్ల అనుభవగ్నుడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ పోరులో యువ ఆటగాడికే విజయం వరించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇలా ప్రీ క్వార్టర్స్‌లోనే ఓడిపోవడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆదివారం జరిగిన మ్యాచుల్లో ఫెదరర్ ఓటమి పెద్ద సంచలనమైంది. తొలి సెట్‌ను చెమటోడ్చి నెగ్గిన ఫెదరర్ తర్వాతి సెట్లలో పోరాడినా ఫలితం దక్కలేదు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ (3 గంటల 45 నిమిషాల) వరకు సాగింది. నాలుగు సెట్లలో మూడు సెట్లు టై బ్రెకర్ వరకు వెళ్లడం గమనార్హం.
సిలిక్‌కు ఎదరుదెబ్బ..
పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ మారిన్ సిలిక్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 22వ సీడ్ రొబర్టొ బౌటిస్ట అగాట్ (స్పెయిన్) 6 6 6 4 6 తేడాతో మారిన్ సిలిక్ (క్రొయేషియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన 21 ఏళ్ల యువ ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫె 7 7 6 7 20వ సీడ్ గ్రీగర్ డిమిట్రోవ్ (బల్గేరియా)పై చెమటోడ్చి నెగ్గాడు.
నాదల్ అలవోకగా..
ఆదివారం జరిగిన మ్యాచుల్లో సీనియర్లకు మిశ్రమ ఫలితాలు దక్కుతుంటే మరోవైపు స్పెయిన్ స్టార్ 32 ఏళ్ల రాఫెల్ నాదల్ మాత్రం అద్భుతమైన ఆటతో తన అభిమానులను ఆలరించాడు. వరుస సెట్లలో విజయాలు సాధించి అలవోకగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6 6 7 థోమస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించి ముందంజ వేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్ తొలి సెట్‌ను 6 రెండో సెట్‌ను 6 సునాయాసంగా గెలుచుకున్నాడు. ఇక ఆఖరి సెట్లో నాదల్కు ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. హోరాహోరీగా జరిగిన ఈ సెట్లో చివరికి టై బ్రేకర్‌లో నాదల్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
కెర్బర్ ఇంటికి..
మహిళల సింగిల్స్‌లో జర్మనీ సంచలనం అంజెలిక్యూ కెర్బర్‌కు షాక్ తగిలింది. ఇక్కడ జరిగిన సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ అంజెలిక్యూ కెర్బర్ (జర్మనీ)పై అమెరికాకు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియల్ కొలిన్స్ 6 6 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కొలిన్స్ జర్మనీ స్టార్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈమె ధాటికి కెర్బర్ తొలి సెట్లో ఒక్క పాయింట్ కూడా చేయలేక పోయింది. రెండో సెట్లోనూ రెండు పాయింట్లు మాత్రమే చేసిన కెర్బర్ 6 సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో కెర్బర్ టైటిల్ ఆశలు అవిరయ్యాయి.
షరపోవాపై ఆష్లే గెలుపు..
మహిళల మరో సింగిల్స్ మ్యాచ్‌లో రష్యా బ్యూటీ, మాజీ నెంబర్‌వన్ మారియ షరపోవాకు ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టి షాకిచ్చింది. ఇక్కడ జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 15వ సీడ్ ఆష్లే బార్టి (ఆస్ట్రేలియా) 4 6 6 30వ సీడ్ మారియ షరపోవా (రష్యా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది. తొలి సెట్‌ను గెలుచుకొని దూకుడుగా కనిపించిన షరపోవా తర్వాతి సెట్లలో వరుస ఓటములను చవిచూసింది. ఈ విజయంతో ఆష్లే బార్టి కెరీర్లో తొలి సారిగా గ్రాండ్‌శ్లామ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటొవా (చెక్ రిపబ్లిక్) 6ఆష్లే బార్టి 6 6 అమాండ అనిసిమోవా (అమెరికా)ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన క్విటొవా ఈజీగా రెండు సెట్లను గెలుచుకుంది.
ఫెదరర్‌కు షాక్
RELATED ARTICLES