వాషింగ్టన్ : అత్యంత అరుదుగా కనిపించే చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. దీనికి సైంటిస్టులు సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ అని పేరు పెట్టారు. భారత కాలమానం ప్రకారం జనవరి 21 ఉదయం 10:11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలవుతుంది. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్, వోల్ఫ్ మూన్ కలిస్తే ఈ అరుదైన సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ ఏర్పడుతుంది. అయితే ఈ అరుదైన సంపూర్ణ గ్రహణాన్ని ఇండియాతోపాటు ఏషియాలోని ప్రజలు పూర్తిగా చూసే అవకాశం లేదు. అమెరికా, యూరప్, ఆఫ్రికా ప్రజలకు ఇది పూర్తిగా కనిపిస్తుంది. సంపూర్ణ గ్రహణం 62 నిమిషాల పాటు కొనసాగుతుంది. పూర్తి ప్రక్రియకు 3 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. శీతాకాలంలో కనిపించే పౌర్ణమి చంద్రుడికి అమెరికన్ గిరిజనులు ముద్దుగా పెట్టుకున్న పేరు వోల్ఫ్ మూన్.
సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ నేడే!
RELATED ARTICLES