ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ముగించిన భారత్
మెల్బోర్న్: సుదీర్ఘ కాలం జరిగిన ఆస్ట్రేలియా పర్యటన ను కోహ్లీ సేన సగర్వంగా ముగించింది. దాదాపు రెండు నెలలపాటు జరిగిన ఈ పర్యటనలో భా రత్ ఆస్ట్రేలియా తో టి20, టెస్టు, వన్డే సిరీస్‌లను ఆడింది. అందులో టెస్టు, వన్డే సిరీస్‌లను రికార్డు స్థాయిలో గెలుచుకున్న భారత్ టి20 సిరీస్‌ను డ్రా చేసుకుంది. దీంతో ఈ పర్యటనలో భారత్ ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 2 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఒక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. చతేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలిచారు. బ్యాటింగ్‌లో పుజారా చెలరేగితే.. బౌలింగ్‌లో బుమ్రా విజృంభించాడు. మరోవైపు ఇతర ఆటగాళ్లు కూడా వీరికి అండగా నిలవడంతో భారత్ రికార్డు స్థాయిలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా ముగిసిన వ న్డే సిరీస్‌లోనూ టీమిండియా అదరగొట్టింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 34 పరుగులతో ఓటమిపాలైంది. అనంతరం పుంజుకున్న భారత్ ఆడిలైడ్, మెల్బోర్న్ వేదికలుగా జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు అదరగొట్టారు. అందరూ కలిసి కట్టుగా రాణించడంతో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను ముద్దాడింది. ముఖ్యంగా బౌలర్లు విజృంభించి బౌ లింగ్ చేశారు. పటిష్టమైన ఆసీస్‌ను వారి సొంతగడ్డపై త క్కువ స్కోరుకే కట్టడి చేశారు. మూడు మ్యాచుల్లోనూ కంగారూ జట్టును 300 పరుగుల లోపలే అడ్డుకున్నారు. భారీ స్కోర్లు సాధించకుండా ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌పై విరుచుకుపడ్డారు. తొలి రెండు వన్డేల్లో 288, 299 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆఖరి వన్డేలో మాత్రం 230 పరుగులకే కుప్పకూలింది. తొలి మ్యాచ్ ఆడిన యాజువేంద్ర చాహల్ ఆరు వికెట్లతో విధ్వంసం సృష్టించాడు. మరోవైపు బ్యాటింగ్‌లో ధోనీ, కేదర్ జాదవ్, విరాట్ కోహ్లీలు రాణించడంతో భారత్ నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌ను దక్కించుకుంది. రెండో వన్డేలో సెంచరీ చేసిన కెప్టెన్ కోహ్లీ (104) చివరి వన్డేలోనూ కీలకమైన బ్యాటింగ్‌తో 46 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో ధోనీ బ్యాటింగ్ అద్భుతం. ప్రపంచకప్‌కు ముందు ధోనీ ఫామ్‌లో రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. వరుసగా మూడు మ్యాచుల్లో ధోనీ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో మొత్తం 193 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే ధోనీ చివరి వన్డేలో మాత్రం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈ స్థానంలో కూ డా ధోనీ అద్భుతంగా రాణించాడు. అజేయ అర్ధ శతకం తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ముందు కోహ్లీ అండతో.. తర్వాత కేదర్ జాదవ్ అండతో ధోనీ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌కు సపోర్ట్ చేసే స్లో పిచ్‌పై కూడా మిస్టర్ కూల్ తన బ్యాట్‌ను ఝుళిపించాడు. తనపై వచ్చిన విమర్శలను ధోనీ తన బ్యాట్‌తో తిప్పికొట్టాడు. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు.