న్యూఢిల్లీ : మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లు తిరిగి ప్రారంభించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నిబంధనలను అత్యున్నత న్యాయస్థానం గురువారం సడలించింది. ముంబయిలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ డ్యాన్స్ బార్లను ఏర్పాటు చేయడానికి అనుమతుల జారీకి కఠిన నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో 2005 నుంచి కొత్తగా డ్యాన్స్ బార్లు ఏర్పాటు కాలేదు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ స్థాయిలో పూర్తిగా నిషేధాన్ని విధించవలసిన అవసరం లేదని పేర్కొంది. అసమంజసమైన షరతులను విధించి, డ్యాన్స్ బార్లను తెరవకుండా సంపూర్ణ నిషేధాన్ని విధించవలసిన అవసరం లేదని పేర్కొంది. డ్యాన్స్ బార్లలో సిసిటివి కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం విధించిన నిబంధనను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కెమెరాలను అమర్చడం వల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని తెలిపింది. మహారాష్ట్ర హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్ రూముల్లో అశ్లీల నృత్యాల నిషేధం, వాటిలో పని చేసే మహిళల గౌరవ, మర్యాదల పరిరక్షణ చట్టాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. బార్ లోపల డ్రింక్స్ సర్వ్ చేసే చోటు నుంచి డ్యాన్సింగ్ స్టేజ్‌ను వేరుగా ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెప్తోంది.
డ్యాన్స్ బార్లకు సుప్రీం ఒకె
RELATED ARTICLES