హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత (సిఎల్పి) ఎంపికపై తుదినిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకే వదిలిపెడుతూ సిఎల్పి సమావేశం తీర్మానం చేసింది. సిఎల్పి నేత ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం పంపిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్.. హైదరాబాద్‌లో శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకున్నారు. సీఎల్పీనేతగా తమకు కూడా అవకాశం కల్పించాలని కొందరు నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వేణుగోపాల్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్.సి.కుంటియా, టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. సిఎల్పి నేత ఎంపిక విషయం పార్టీ అధినేత రాహుల్ గాంధీకే నిర్ణయాన్ని వదిలిపెడుతూ పార్టీ శాసనసభాపక్ష కమిటీ ఏక వాక్య తీర్మానం చేసిందని తెలిపారు. అతి త్వరలోనే రాహుల్‌గాంధీ సిఎల్పి నేతను ఎంపిక చేస్తారని తెలిపారు.
సిఎల్పి నేత ఎంపిక నిర్ణయం రాహుల్‌కే…
RELATED ARTICLES