ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేసిన మండలి చైర్మన్ స్వామిగౌడ్
సభ్యత్వాలను రద్దు చేస్తూ నిర్ణయం
వెంటనే అమల్లోకి వస్తుందంటూ శాసనసభ కార్యదర్శి పేరిట బులెటిన్ విడుదల
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ముగ్గురు శాసనమండలి సభ్యులపై శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అనర్హత వేటు వేశారు. ఎంఎల్‌సిలు భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములునాయక్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులోని పేరా 2(1)(ఎ), 191(2) అధికారణలను అనుసరించి శాసనమండలి ఆరవ నిబంధన మేరకు చైర్మన్ స్వామిగౌడ్ వారిని అనర్హులుగా ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు.ఈ మేరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు పేరుతో బుధవారం శాసనమండలి బులెటిన్ విడుదల చేశారు. దీంతో భూపతిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం, యాదవరెడ్డి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ కోటా, రాములు నాయక్ ప్రాతినిధ్యం వహించిన నామినేటెడ్ కోటాలో ఖాళీలు ఏర్పడ్డా యి. ఫలితంగా శాసనమండలిలో ఖాళీల సంఖ్య ఏడుకు పెరిగింది. టిఆర్‌ఎస్‌కు చెందిన ఆర్. భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డిలతో పాటు సభావత్ రాములు నాయక్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు.
ముగ్గురు ఎంఎల్‌సిలపై అనర్హత వేటు
RELATED ARTICLES