పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ భారీ పేలుడు సంభవించింది. 9వ అరోన్డిస్మెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేలుడు కారణంగా అక్కడి భవనాలు ధ్వంసమయ్యాయి. పరిసర ప్రాంతాలు భయానకంగా మారింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పేలుడుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రజలెవరూ ఘటనా స్థలం వైపు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన భవనంలోని ఓ బేకరీలో గ్యాస్ లీకై పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.
పారిస్లో భారీ పేలుడు
RELATED ARTICLES