పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు
చౌటుప్పల్ : సంక్రాంతి పండగ సందర్భంగా నగర వాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో స్వగ్రామాలకు తరలడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద టోల్ ఛార్జీలు చెల్లించేందుకు వాహన చోదకులు గంటలకొద్ది వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టోల్‌గేట్ నుంచి లింగోజీ గూడెం సమీపంలోని దివిస్ పరిశ్రమ వరకు 3కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీ నేపథ్యంలో యాదాద్రి జిల్లా డిసిపి రామచందర్‌రెడ్డి, చౌటుప్పల్ ట్రాఫిక్, సివిల్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. అడ్డాకుల టోల్‌ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ భారీగా ఉంది.