చంద్రునికి ఆవలివైపు ఫొటోను పంపిన చైనా స్పేస్‌క్రాఫ్ట్
మనం నిత్యం చూసే చందమామ ఓ వైపు మాత్రమే. రెండో వైపు మనం ఇంతవరకు చూడలేదు. ఇప్పటివరకు చూడని చంద్రుని ఫొటో ను చైనాకు చెందిన చాంగ్-4 స్పేస్‌క్రాఫ్ట్ పంపించింది. చాంగ్-4 అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను చైనా ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా జనవరి 3న చంద్రునికి ఆవలివైపున ల్యాండ్ చేసిన విషయం తెల్సిందే. ఈ స్పేస్‌క్రాఫ్ట్ చందమామ ఆవలివైపున ఉపరితలంపై ల్యాండ్ అయ్యాక యుటు-2 అనే రోవర్ ల్యాండర్ నుంచి విజయ వంతంగా వేరుపడింది. ఆ తర్వాత వెనువెంటనే చంద్రుని ఫోటోను భూమిపైకి పంపించగా, దీనిని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సిఎన్ఎస్ఎ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫొటోలో చంద్రుడితోపాటు ల్యాండర్, రోవర్ కూడా కనిపిస్తున్నాయి.