శ్రీనగర్: పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. గురువారం ఉదయం జమ్ము కశ్మీర్ పూంచ్ సెక్టార్‌లో వరుసగా మూడోరోజూ జనవాసాల ఇళ్లపై కాల్పులు పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు. దీనిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సైనిక అధికారులు వెల్లడించారు. బుధవారం కూడా రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో కాల్పులు జరిపినట్లు తెలిపారు. మంగళవారం పూంచ్ సెక్టార్‌లో కాల్పులకు తెగబడినట్లు చెప్పారు. గత పదిరోజులుగా ఎల్‌ఒసిలో పాక్ రేంజర్లు ఏడుసార్లు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. దీంతో స్థానికులు నివాసముండేందుకు భయపడుతున్నారని వెల్లడించారు.
మూడోరోజూ కాల్పులకు తెగబడ్డ పాక్
RELATED ARTICLES