న్యూఢిల్లీ: భారత సైన్యం కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుందని, సైన్యంలో స్వలింగ సంపర్కులను అనుమతించమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. గురువారం నాడు ఆయన వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘మేము అంత ఆధునికంగా, పాశ్చాత్యంగా ఉండలేం. ఎల్జీబీటీ అంశం సైన్యంలో అంగీకారయోగ్యం కాదు’ అని రావత్ వెల్లడించారు. ఆర్మీ చట్టం ప్రకారమే తాము ఇంకా నడుచుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని చరిత్రాత్మక తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. సమానత్వ హక్కును అది ఉల్లంఘిస్తోందంటూ 158ఏళ్ల నాటి చట్టాన్ని కోర్టు కొట్టేసింది. అయితే తీర్పు వెలువడిన సమయంలో కూడా రావత్.. ఆర్మీ విషయంలో ఇలాంటివి క్షమార్హమైనవి కావని సైన్యాన్ని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఆర్మీ విషయంలో ఈ తీర్పును అమలు చేయడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని మిలిటరీ న్యాయ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆర్మీ నిబంధనల్లో ఎలాంటి తేడా ఉండదని చెప్పారు.
భారత ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
RELATED ARTICLES