పుదుక్కొట్టయ్ : కేరళలోని శబరిమలలో గల అయ్యప్ప దర్శనానికి వెళ్లిన ఒక అయ్యప్ప భక్తుల బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారంనాడు తమిళనాడులోని పుదుక్కొట్టయ్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 11 మంది దుర్మరణంపాలయ్యారు. వీరంతా తెలంగాణ మెదక్ జిల్లాకు చెందిన వారే. 16 మంది భక్తులతో కూడిన అయ్యప్ప బృందం ఒక వ్యానులో ఈనెల 2వ తేదీన బయలుదేరింది. వీరు తమిళనాడులో రామేశ్వరంలో దర్శనానంతరం శబరిమల బయలుదేరారు. అయితే పుదుక్కొట్టయ్‌లో వారు వెళ్తున్న వాహనాన్ని ఒక కంటెయినర్ ఢీకొనడంతో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు పుదుక్కొట్టయ్ లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా కలెక్టర్ పుదుక్కొట్టయ్ కలెక్టర్‌తో మాట్లాడి క్షతగాత్రులకు సత్వర చికిత్స కోసం విజ్ఞప్తి చేశారు. మృతులు నర్సాపూర్‌లోని హత్నూర్ గ్రామానికి చెందినవారు.
ఘోర విషాదం : 11 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం
RELATED ARTICLES