మూడో రోజు చెలరేగిన కుల్దీప్, జడేజా
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 236/6, చివరి టెస్టు
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. మొదట బ్యాట్స్‌మెన్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా.. ఇప్పుడు బౌలర్లు కూ డా దూకుడైన బౌలింగ్‌తో తమ సత్తా చాటుతున్నారు. భా రత్ మొదటి ఇన్నింగ్స్‌లో 622/7 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాపై కుల్దీప్య యాదవ్, రవీంద్ర జడేజాలు విరుచుకుపడటంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి కంగారు జట్టు 83.3 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ముం దుగానే ఆగిపోయింది. ఆసీస్‌లో ఓపెనర్ మార్కస్ హా రీస్ (79; 120 బంతుల్లో 8 ఫోర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేయగలిగాడు. ఇక ఈసారి భారత స్పిన్నర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. వీరి ధాటికి ఆసీస్ (198) పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్ (71/3) వికెట్లతో చెలరేగాడు. ఆసీస్ కీలక బ్యాట్స్‌మెన్స్‌ను పెవిలియన్ పంపి తనను తుది జట్టులో తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించుకున్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా 62 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాగా.. మహ్మద్ షమీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పీటర్ హాండ్స్‌కొంబ్ (28 బ్యాటింగ్), పాట్ కమ్మిన్స్ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఒక వికెట్ కూడా దక్కలేదు. ఆసీస్ బ్యాటింగ్‌ను చూస్తుంటే భా రత్‌కు మరో భారీ విజయం ఖాయమనిపిస్తోంది. భారత్ చేసిన సగం స్కోరును కూడా దాటకుండానే ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ జట్టు 386 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు వెనకబడి ఉం ది. అయితే శనివారం వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా మొ త్తం (90 ఓవర్లు) పూర్తి కాకుండానే మ్యాచ్‌ను నిలిపివేయ డం జరిగింది. ఆదివారం నాలుగో రోజు అదనపు ఓవర్లు ఆడిస్తారని సమాచారం. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ సేన ఇప్పటికే 2 ఆధిక్యంలో నిలిచింది. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆసీస్‌లో ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయాన్ని ఈసారి కోహ్లీ సేన భారత్‌కు అందించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈసారి ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తు చేసి చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని నమోదుచేయాలనే పట్టుదలతో భారత జట్టు కనిపిస్తున్నది. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆదివారం ఆటలో మిగిలిన నాలుగు వికెట్లను త్వరగానే తీసేసి భారత్ ఆసీస్‌ను ఫాలో ఆన్ ఆడించాలని భావిస్తోంది.
శుభారంభం లభించినా..
శనివారం 24/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖవాజా శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే వీరు తొలి వికెట్‌కు 99 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఒకవైపు ఖవాజా సమన్వయంతో ఆడుతుంటే.. మరోవైపు హారీస్ మాత్రం చెలరేగి ఆడాడు. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పరుగుల వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే హారీస్ 67 బంతుల్లోనే 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అనంతరం పుంజుకున్న కుల్దీప్ యాదవ్ ఆసీస్‌కు తొలి ఎదురుదెబ్బేశాడు. కుదురుగా ఆడుతున్న ఆసీస్ కీలక బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా (27; 71 బంతుల్లో 3 ఫోర్లు)ను పుజారాచే క్యాచ్ పట్టించి పెవిలియన్ పంపాడు. దీంతో కంగారూ జట్టు 72 పరుగల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన మర్నూస్తో కలిసి హారిస్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ తమ వికెట్లను కాపాడుకున్నారు. సింగిల్స్, డబుల్స్‌తో స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే ఆసీస్ 29.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు రెండో వికెట్‌కు 103 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొలిపారు. తర్వాత లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.
విజృంభించిన జడేజా..
లంచ్ విరామం తర్వాత రవీంద్ర జడేజా విజృంభించాడు. రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తున్నా ఈ జంటను విడదీసి భారత్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. జడేజా ధాటికి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న ఓపెనర్ మార్కస్ హారిస్ 120 బంతుల్లో 8 ఫోర్లతో 79 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 128 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. షాన్ మార్ష్‌ను కూడా జడేజా తెలివైన బంతితో పడగొట్టాడు. దీంతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన షాన్ మార్ష్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేశాడు. తర్వాత ఆసీస్ స్కోరు 152 పరుగుల వద్ద బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతున్న మరో కీలక బ్యాట్స్‌మన్ మర్నూస్ (38; 95 బంతుల్లో 7 ఫోర్లు)ను మహ్మద్ షమీ అద్భుతమైన బంతితో పెవిలియన్ దారి చూపెట్టాడు. దీంతో ఆసీస్ 24 పరుగుల వ్యవధిలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చెలరేగిన కుల్దీప్..
అయితే ఈ సమయంలో భారత్‌కు చైనామన్ కుల్దీప్ యాదవ్ మరోసారి ఊరాటనిచ్చాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను విడదీసి ఆసీస్‌కు పెద్ద షాకిచ్చాడు. కుదురుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ (56 బంతుల్లో 20)ను కుల్దీప్ తన బౌలింగ్‌లో తానే క్యాచ్ పట్టి పెవిలియన్ పంపాడు. దీంతో ఆసీస్ 192 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను చేజార్చుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. తర్వాత మరో ఆరు పరుగుల వ్యవధిలోనే కుల్దీప్ ఆసీస్‌కు మరో ఊహించని ఎదురుదెబ్బేశాడు. అప్పుడు క్రీజులోకి అడుగుపెట్టిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ను ఎక్కువ సేపు క్రీజులో నిల్చోకుండా అడ్డుకున్నాడు. తన స్పిన్ మాయను మరోసారి చూపెడుతూ పైన్‌ను (5) పరుగులకే క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ పంపి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో ఆసీస్ 68.6 ఓవర్లలో 198 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పాట్ కమ్మిన్స్ ఆసీస్‌ను మరోసారి ఆదుకున్నాడు. మెల్బోర్న్ టెస్టులో అసాధారణ బ్యాటింగ్ చేసిన కమ్మిన్స్ ఈసారి కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఇన్ని వికెట్లు పడినా పట్టించుకోకుండా తన దైన శైలిలో దూకుడుగా ఆడుతూ సోరుబోర్డును పరిగెత్తించాడు. మరోవైపు హాండ్స్‌కొంబ్ సమన్వయంతో ఆడుతూ ఇతనికి అండగా నిలిచాడు. వీరిద్దనూ ఏడో వికెట్‌కు మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొలిపి ఆసీస్‌ను ఆదుకున్నారు. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా (83.3 ఓవర్లలో) 6 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. పీటర్ హాండ్స్‌కొంబ్ (91 బంతుల్లో 28 బ్యాటింగ్), పాట్ కమ్మిన్స్ (41 బంతుల్లో 6 ఫోర్లతో 25 బ్యాటింగ్) అజేయంగా క్రీజులో నిలుచున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 38 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు, మహ్మద్ షమీ ఒక వికెట్ తీశారు.
ఆదుకునే ప్రయత్నం చేసిన హాండ్స్‌కొంబ్..
ఈ పిరిస్థితుల్లో ట్రావిస్ హెడ్‌తో కలిసి పీటర్ హాండ్స్‌కొంబ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. వీరు పెద్ద షాట్ల జోలీకి వెళ్ల కుండా సింగిల్స్, డబుల్స్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఆసీస్‌ను త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్‌ను తొందరగా ముగించాలన్న భారత బౌలర్ల ఆశలపై వీరిద్దరూ నీరుగార్చుతూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే వీరు ఐదో వికెట్‌కు 30 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.
టీమిండియాదే పైచేయి
RELATED ARTICLES