భోపాల్: వందేమాతరంతో పాటు జనగణమన కూడా పాడతామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వెల్లడించారు. అయితే ప్రతి నెల మొదటి పని దినం రోజున పోలీస్ బ్యాండ్‌తో శౌర్య సమర్కార్ నుంచి వల్లభ్ భవన్ వరకు నడిచి వచ్చి ఆ తర్వాత వందే మాతరం, జనగణమన పాడతామని వెల్లడించారు. ప్రజల్లో దేశభక్తి భావనను రేకెత్తించేందుకు పోలీస్ బ్యాండ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని కమల్ నాథ్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ హయాంలో ప్రతి నెల మొదటి పని దినం రోజున సెక్రటేరియట్‌లో వందేమాతర గీతం పాడేవారు. కాగా ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వందేమాతరం గీతం పాడే విషయంలో మధ్యప్రదేశ్‌లో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
ఆ రెండు గీతాలు పాడుతాం
RELATED ARTICLES