అభాసుపాలైన కేంద్ర ప్రభుత్వ పథకం
ఫలితంగా రోడ్డు పాలవుతున్న పసిగుడ్డులు
ప్రజాపక్షం/ హైదరాబాద్: తల్లిదండ్రులకు ఇష్టంలేని తమ పసిగుడ్డులను క్షేమంగా ప్రభుత్వానికి చేరే విధంగా పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘ఉయ్యాల’ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి రాష్ట్రానికి సుమారు రూ.400 కోట్లు కేటాయించారు. గ్రామ పం చాయితీ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, ప్రసూతి ఆసుపత్రుల వద్ద ‘ఉయ్యాల’ (తొట్టెల)ను ఏర్పాటు చేయాలి. తమకు పుట్టిన శిశువు నచ్చకపోతే ఆ తల్లిదండ్రులు ఆ శిశువును రోడ్లపైనో, చెట్ల పొదల్లో, చెత్త కుండిల్లో, నాలాల్లో పడేయకుండా వారు ఆ శిశువును ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయ్యాలలో వేయాలి. అలా ఉయ్యాలకు చేరిన శిశువును మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాలకు తరలించి వారి ఆలనపాలన చూస్తారు. కావల్సిన దంపతులకు వారిని దత్తత కూడా ఇస్తారు. ఉయ్యాల పథకం రాష్ట్రంలో పూర్తిగా నీరుగారి పోయిం ది. భూతద్దంతో చూసినా ఒక్క ఊయల కనిపించదు. ఫలితంగా వివిధ కారణాలతో రోడ్డు పాలవుతున్న పసిగుడ్డుల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్ల అంటే చులకన భావన, భారం అనే ఉద్దేశం ఇప్పటికీ అనేక మందిలో ఉంది. కాస్త వైద్యపరవైన అవగాహన కలిగిన వారు గర్భస్థ దశలోనే స్కానింగ్ తదితరాలను ఆశ్రయించడం ద్వారా పుట్టబోయేది ఎవరో తెలుసుకుంటున్నారు. ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం నిషేధించినా ‘డిమాండ్’ను బట్టి జరుగుతూనే ఉన్నాయి. పుట్టబోయే వారి వివరాలు తెలుసుకుంటున్న వారిలో అనేక మంది గర్భస్త్రావం వంటి వాటి వైపు మొగ్గుతూ బ్రూణ హత్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం లేని దిగువ, మధ్య తరగతి, కింది తరగతులకు చెందిన వారు బిడ్డ పుట్టే వరకు ఆగి ఆపై ఆడపిల్ల లయితే వీధుల పాలు చేస్తున్నారు. రోడ్డు పాలవుతున్న ఆడ శిశువులతో పోలిస్తే మగ శిశువుల సంఖ్య 5 శాతం కూడా ఉండట్లేదు.
కారణాలు అనేకం మరచి బిడ్డల బొడ్డూడక ముందే నడిరోడ్డుపై వదిలేయడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సామాజిక నేపథ్యం, ఆర్ధిక కారణాలు, కుటుంబ పరిస్థితులు వీటన్నింటి ప్రభావం ఉందని వివరిస్తున్నారు. ఆడపిల్లలను వదిలించుకోవాలనే భావన ప్రధాన కారణంగా ఉంది. దీంతో పాటు ఆర్ధిక పరిస్థితులు అనుకూలంచక, భార్యాభర్తల మధ్య స్పర్థలు, సక్రమంగా లేని కుటుంబ నేపథ్యాల కారణంగా ను మాతృత్వాన్ని మర్చిపోతున్నారు. దీనికి తోడు పుట్టిన బిడ్డలో వైకల్యాలు, గుండెకు రంధ్రం వంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నప్పుడూ వారిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలానా బిడ్డ కావాలం టూ ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆ ఫలితం లభించకపోయినా వదిలించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య నగరాల కంటే దాని చుట్టుపక్కల విస్తరించి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు.
అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం రకంగా వీధుల పాలవుతున్న శిశువులు పెరిగే కొద్ది మానసికంగా ధ్వేషభావాన్ని పెంచుకునే అవకాశం ఉందిని మానిసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజంపై ఏహ్యాభావం పెరగడం, ఆలనాపాలనా లేకపోవడం ఫలితంగా పెడదారులు పట్టి అ సాంఘిక శక్తులుగా మారే అవకాశముందని అంటున్నారు. పెరిగే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాల కారనంగా వీరిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుందని, త్వరగా వ్యసనాలకు బానిసలుకావడంతో పాటు కరుడుగట్టిన వారిగానూ మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇలా పసిగుడ్డులు రోడ్డుపాలు కావడంతో తల్లి తప్పు ఎంతో ఉంటుందో..తండ్రి తప్పు అదే స్థాయిలో ఉంటుంది.