న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు వచ్చి రాఫెల్ వ్యవహారంపై స్పందించేందుకు ప్రధాని మోడీకి ధైర్యం లేదని లోక్‌సభలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆయన తన గదిలో ఉండిపోయారని ఎద్దేవా చేశారు. మోడీకి పార్లమెంటుకు వచ్చి రాఫెల్‌పై సమాధానం చెప్పేందుకు ధైర్యం లేదని, సభలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నా.. ఆమె అన్నా డిఎంకె ఎంపీల వెనుక దాక్కున్నారని విమర్శించారు. రాఫెల్ జెట్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సిఎం మనోహర్ పారికర్ బెడ్ రూంలో ఉన్నాయన్న గోవా మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులను సభలో వినిపించాలని రాహుల్ పట్టుబట్టారు. ఈ క్రమంలోనే కొంత సేపు సభలో వాడి వేడిగా చర్చ జరిగింది. సభ తొలుత 2.30కు వాయిదా పడింది. అనంతరం సభ పునఃప్రారంభమయ్యాక రాఫెల్ అంశంపై రాహుల్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా రాఫెల్ విచారణ వ్యవహారం తమ పరిధిలోకి రాదని చెప్పింది కానీ, జెపిసి ఏర్పాటు చేయకూడదని ఎక్కడా అనలేదని రాహుల్ గుర్తు చేశారు.
రాఫెల్‌పై మాట్లాడేందుకు మోడీకి ధైర్యం లేదు
RELATED ARTICLES