బంగ్లా ఎన్నికల్లో అవామీ లీగ్ అఖండ విజయం
288 స్థానాల్లో విజయ దుందుభి
హసీనాకు అభినందనలు తెలిపిన ప్రధాన నరేంద్ర మోడీ
ఢాకా: బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో అధికార కూటమి విజయ దుందుభి మోగించింది. ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్, దాని మిత్రపక్షాలు భారీ విజయా న్ని సాధించాయి. అవామీ లీగ్ నేతృత్వంలోని గ్రాండ్ అలయెన్స్ కూటమి 300 స్థానాల్లో పోటీ చేయగా 288 స్థానాలను కైవసం చేసుకుంది. 2008 ఎన్నికల్లో 263 సీట్లను సాధించిన ఆ పార్టీ ఈ సారి తన ఓట్ల శాతాన్ని మరింత మెరుగుపరుచుకొని ఇంతకు ముందు కన్న ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 82 శాతం ఓట్లను సంపాదించి అత్యధిక సీట్లను సొంతం చేసుకుంది. ప్రతిపక్ష కూటమి జతియా ఓక్యా ఫ్రంట్ యూనిటీ ఫ్రంట్లు చాలా సెగ్మెంట్లలో అధికార కూటమికి కనీసం పోటీని ఇవ్వలేదు. ఈ కూటమి దేశ వ్యాప్తంగా 15 శాతం ఓట్లను సాధించి.. 7 సీట్లనే దక్కించుకోగల్గింది. రెండు కూటమిలకు సంబంధం లేని ఇతరులు మరో 3 సెగ్మెంట్లలో విజయం సాధించారు. రెండు స్థానాల్లో ఒక్క దాంట్లో ఎన్నికలు జరగలేదు. మరో స్థానంలో ఎన్నికలు జరిగిన కౌం టింగ్ వాయిదా వేశారు. ఈ రెండు స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం నేషనల్ యూనిటీ ఫ్రంట్ అధినేత, న్యాయవాది కమ ల్ హుస్సెన్ మాట్లాడుతూ.. పోలింగ్ సందర్భంగా అన్ని కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు.