న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరి 2న సాధారణ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అమరావతి పరిధిలో నిర్మిస్తున్న భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ఈ పిటిషన్‌ను విచారణ స్వీకరించినప్పటికీ.. అత్యవసర విచారణను చేపట్టలేమని స్పష్టంచేశారు. జనవరి రెండున సాధారణ విచారణ చేపడతామని తెలిపారు. మరోవైపు హైకోర్టు విభజన అవసరమేనంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది.
హైకోర్టు విభజనపై అత్యవసర విచారణ తిరస్కరణ
RELATED ARTICLES