శతకాలతో చెలరేగిన లాథమ్, నికొలాస్
న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు
క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొద టి టెస్టులో శ్రీలంక ఓటమి అంచుల్లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్స్ టామ్ లాథమ్ (176; 370 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), నికొలాస్ (162 నాటౌట్; 225 బంతుల్లో 16 ఫోర్లు) అసాధరణ బ్యాటింగ్‌తో చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 585 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసి శ్రీలంక ముందు 660 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వి కెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. కెప్టెన్ దినేష్ చండీమల్ (14 బ్యాటింగ్), కుశాల్ మెండీస్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు గుణతిలక (4), కరుణరత్నే (0) పరుగులకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ తలొక వికెట్ తీశారు. అంతకుముందు 231/2 పరుగుల ఓవర్‌నైట్ స్కో రుతో శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యా ట్స్‌మన్ రాస్ టెలర్ (44 బం తుల్లో 6 ఫోర్లతో 44) పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన లాథమ్ (176) పరుగులు చేసి వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన కొలిన్ డి గ్రాండ్‌హూమ్ చెలరేగి ఆడాడు. గ్రా ండ్‌హూమ్ 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచా డు. అనంతరం కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 153 ఓవర్లలో 585/4 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అసాధరణ ఇన్నింగ్స్ ఆడిన హెన్రీ నికొలాస్ (162) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో లాహిరు కుమార్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఓటమి అంచుల్లో లంక
RELATED ARTICLES