చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారిస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ శుక్రవారం తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, జయలలితకు వైద్యం అందించిన అమెరికా వైద్యుడు రిచర్డ్ బీలేకు కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 20న కూడా పన్నీర్‌కు సమన్లు జారీచేసినా ఆయన హాజరుకాలేదు. దీంతో మరోసారి తమ ఎదుట హాజరు కావాలని ఆయనకు సూచించింది. పళనిస్వామితో కలిసి పనిచేయాలంటే తొలుత జయలలిత మృతిపై విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, జనవరి 8న పన్నీర్ సెల్వం, జనవరి 11న తంబిదురై, జనవరి 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడు రిచర్డ్ బీలే, జనవరి 7న మంత్రి విజయ భాస్కర్ హాజరు కావాలని కోరింది. ఇప్పటివరకు ఈ కమిషన్ అపోలో వైద్యులతో పాటు సుమారు 145 మంది సాక్షులను విచారించింది. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.
జయ మృతి కేసులో పన్నీర్ సెల్వంకు నోటీసులు
RELATED ARTICLES