న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు ఆమోదముద్ర లభించింది. గురువారంనాడు లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన వాడివేడి చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు, ప్రతికూలంగా 11 ఓట్లు లభించాయి. దీంతో బిల్లుకు ఆమోదముద్ర పడినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఈ బిల్లును సమీక్ష నిమిత్తం జాయింట్ సెలక్ట్ కమిటీకి సమర్పించాలని కాంగ్రెస్, టిఎంసి, ఎఐఎడిఎంకె తదితర పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం వాటిని తిరస్కరించి, ఓటింగ్‌కు పెట్టింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం అనంతరం కాంగ్రెస్, టిఎంసి, ఎఐఎడిఎంకె, ఆర్‌జెడి పక్షాలు వాకౌట్ చేశాయి. కాగా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రతిపాదనలు వీగిపోయాయి.
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు ఆమోదముద్ర!
RELATED ARTICLES