భారతదేశంలో ఉన్న జంట పట్టణాలు మరియు భారతీయ రాష్ట్రాల సోదర నగరాల గురించి మనలో చాలామందికి తెలియదు. వీటిని సిస్టర్ సిటీస్ అని కూడా అంటారు. ఒకటి కాదు రెండు కాదు 10 వున్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం..
- గుజరాత్ లోని అహ్మదాబాద్ – గాంధీనగర్
గాంధీనగర్-అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి జంట నగరాలుగా ఉన్నాయి. అహ్మదాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఇక్కడ నుంచి గాంధీనగర్ సుమారు 24 కిమీ దూరంలో ఉంది. గాంధీనగర్ ను ఇండియాలో గ్రీన్ సిటీ అని కూడా అంటారు
- ఒడిషాలోని కటక్-భువనేశ్వర్
ఇవి ఒకదానికొకటి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మరియు మహానది నదిచే విభజించబడ్డాయి. కటక్-భువనేశ్వర్ రెండు బాగా అభివృద్ధి చెందిన సిటీలు..
- ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్-సికింద్రాబాద్
హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లను కలిపి ఆంధ్రప్రదేశ్ యొక్క జంట నగరాలుగా చెప్తారు. అయితే ఇప్పుడు ఇవి తెలంగాణా లో ఉన్నాయి. ఇవి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్.
- మహారాష్ట్రలోని పూణె-పింప్రి చించ్వాడ్
పింప్రి-చిన్చ్వాడ్ బాగా అభివృద్ధి చెందిన నగరం, పూణే లోని పింప్రి మరియు చిన్చ్వాడ్ జంట నగరాలను కలిగి ఉంది. పుణే మరియు పింప్రి చిన్చ్వాడ్ లు పూణే నగర కేంద్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక టవున్ షిప్ గా ప్రసిద్ది చెందాయి.
- పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా-హౌరా
హుగ్లీ నది పశ్చిమ ఒడ్డున ఉన్న హౌరా కోలకతాకు జంట నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇవి నాలుగు నదీ వంతెనలతో అనుసంధానించబడి ఉన్నాయి మరియు హౌరా వంతెన ప్రసిద్ది చెందింది.
6.కేరళలోని కొచ్చి-ఎర్నాకుళం
కేరళలోని ఎర్నాకులం జిల్లాలో కొచీ లేదా కొచ్చిన్ భారతదేశం యొక్క ప్రధాన ఓడరేవు. కొచ్చి-ఎర్నాకులం జంట నగరాల ప్రధాన భూభాగం భారతదేశంలో ఆరవ ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఉంది.
- కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్
హుబ్లీ మరియు ధార్వాడ్ కర్ణాటకలోని జంట నగరాలు. ఇవి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చంద్రమౌళీశ్వర ఆలయం,ఉన్కాల్ సరస్సు మరియు నృపతుంగా హిల్ ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు.
- ఛత్తీస్ ఘఢ్ లోని దుర్గ్-భిలాయ్
భిలాయ్ ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ జిల్లాలో ఉంది. దుర్గ్ మరియు బిలాయి జంట నగరాలు ఛత్తీస్ ఘఢ్ యొక్క పారిశ్రామిక మరియు విద్యా కేంద్రంగా ఉన్నాయి. దుర్గ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో భిలాయ్ ఉంది. ఉక్కు కర్మాగారానికి భిలాయ్ ప్రసిద్ధిచెందినది.
- జార్ఖండ్ లోని రాంచీ-హటియా
రాంచి ఝార్ఖండ్ రాజధాని నగరం మరియు హటియా జిల్లాలో ఒక చిన్న పట్టణం మరియు రైల్వే స్టేషన్.వీటిని సోదరి నగరాలు అంటారు.
- తమిళనాడు తిరునెల్వేలి-పాలయంకోట్టై
తమిళనాడులో పాలియంకోటై మరియు తిరునెల్వేలి యొక్క అందమైన జంట నగరాలు ఉన్నాయి. వీటిని కూడా జంట నగరాలు అంటారు.