కొలిర్విల్లి: అమెరికాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు నల్గొండవాసులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొలిర్విల్లో మంగళవారం క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇంట్లో మంటలు చేలరేగి ఈ దారుణం జరిగింది. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం ఆరుగురున్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన నలుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో ముగ్గురు నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాత నాయక్ కుమార్తెలు సాత్విక నాయక్ (16), జ్వాయి నాయక్ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14)గా గుర్తించారు. పైచదువుల కోసం ముగ్గురు అన్నాచెల్లెళ్లూ అమెరికాలోని కొలిర్విల్లిలో ఉంటున్నారు. నాయక్ కుటుంబం నల్గొండలో మిషనరీస్ తరపున పనిచేస్తోంది. చిన్నవయసులోనే దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అమెరికాలో ముగ్గురు నల్గొండ విద్యార్థులు దుర్మరణం
RELATED ARTICLES