స్తంభించనున్న సేవలు
న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు మరోసారి బుధవారంనాడు సమ్మెకు ఉపక్రమించారు. విజయాబ్యాంకు, దేనా బ్యాంకుల ను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం సమ్మె జరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించిపోయే అవకాశం వుంది. వారం రోజుల వ్యవధిలో బ్యాంకుల సమ్మె జరగడం ఇది రెండోసారి. గత శుక్రవారంనాడు (డిసెంబరు 21) కూడా బ్యాంకు యూనియన్లు సమ్మె చేసి తక్షణ వేతన సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. ఈ సమ్మెకు దాదాపు బ్యాంకులన్నీ ఇదివరకే కస్టమర్లకు సమాచారాన్ని అందించాయి. అయితే ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి. ఈ సమ్మె ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది.
బ్యాంకుల రక్షణకు నేడు మళ్లీ సమ్మె!
RELATED ARTICLES