హైదరాబాద్ 317 ఆలౌట్, ప్రస్తుతం పంజాబ్ 202/4
రంజీ ట్రోఫీ మ్యాచ్
హైదరాబాద్: మయాంక్ మార్కండే 6 వికెట్లతో చెలరేగడంతో పంజాబ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. పంజాబ్‌లో అన్మోల్ప్రీత్ సింగ్ (85) పరుగులతో రాణించాడు. ఆదివారం 240/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్ ఆదుకున్నారు. వీరిద్దరూ పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టు స్కోరు 91.1 ఓవర్లలో 250 పరుగులకు చేరింది. అనంతర ం కొద్దిసేపటి తర్వాత దూకుడుగా ఆడుతున్న మెహదీ హసన్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలకమైన 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 43 పరుగులు జోడించింది. తర్వాత వచ్చిన మహ్మద్ సిరాజ్‌తో కలిసి హిమాలయ్ అగర్వాల్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఒకవైపు హిమాలయ్ దూకుడుగా ఆడుతుంటూ మరోవైపు సిరాజ్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ 300 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. అనంతరం కుదురుగా ఆడుతున్న సిరాజ్ (16 బంతుల్లో 2 ఫోర్లతో 13) పరుగులు చేసి మార్కండే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో రవి కిరణ్‌తో కలిసి హిమాలయ్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మార్కండే తెలివైన బంతితో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న హిమాలయ్ అగర్వాల్ (79; 171 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా ఔట్ చేసి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ముగించేశాడు. దీంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 109.3 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైపోయింది. విజృంభించి బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్ మయాంక్ మార్కండే 84 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మరోవైప సిద్ధర్థ్ కౌల్‌కు రెండు వికెట్లు లభించాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌కు మహ్మద్ సిరాజ్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ జివన్జోత్ సింగ్ (1) పరుగుకే పెవిలియన్ పంపాడు. దీంతో పంజాబ్ 13 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (10)ను రవితేజ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి పంజాబ్‌కు మారో 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోన పంజాబ్‌ను అన్మోల్ప్రీత్ సింగ్, సన్వీర్ సింగ్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అనంతరం సమన్వయంతో ఆడుతున్న సన్వీర్ సింగ్ (30; 85 బంతుల్లో 4 ఫోర్లు)ను మెహదీ హసన్ వెనుకకుపంపాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మన్దీప్ సింగ్‌తో కలిసి అన్మోల్ ప్రీత్ మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే అన్మోల్ 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జంటను విడదీయడానికి హైదరాబాద్ బౌలర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ 150 పరుగుల మార్కును దాటింది. చివరికి హైదరాబాద్ బౌలర్ల ప్రయత్నం ఫలించింది. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న అన్మోల్ ప్రీత్ సింగ్ (85; 149 బంతుల్లో 12 ఫోర్లు)ను తనయ్ త్యాగరాజన్ తెలివైన బంతితో ఔట్ చేశాడు. దీంతో పంజాబ్ 166 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. తర్వాత గురుక్రీత్ సింగ్, కెప్టెన్ మన్దీప్ సింగ్ పంజాబ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా ఉండడంతో పంజాబ్ 68 ఓవర్లలో 202/4 పరుగులు చేసింది. మన్దీప్ సింగ్ (46 బ్యాటింగ్), గురుక్రీత్ సింగ్ (21 బ్యాటింగ్) క్రీజలో ఉన్నారు.
విజృంభించిన మార్కండే
RELATED ARTICLES