తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటైన, శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్నది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి (హాదర్షి ), ఇతను నరసింహ స్వామి భక్తుడు.
హాదర్షి కి నరసింహ స్వామిని చూడాలని కోరిక పుట్టగా, అతడిని తపస్సు చేయమని ఆంజనేయస్వామి సలహా ఇస్తాడు. హాదర్షి తపస్సు చేయగా… నరసింహ స్వామి ఉగ్ర నరసింహుడిగా ప్రత్యక్షమవుతాడు. స్వామిని అంత ఉగ్ర రూపంలో చూడలేని హాదర్షి, శాంత రూపం వహించమని కోరుతాడు. అప్పుడు స్వామి కరుణించి, శంతరూపుడై లక్ష్మిసమేతుడై దర్శనమిస్తాడు.
అప్పుడు స్వామి హాదర్షిని ఏదైనా వరము కోరుకోమనగా, లక్ష్మినరశింహ స్వామిగా… లక్ష్మిసమేతంగా అక్కడ కొండపై కొలువుండమని కోరుకుంటాడు. అయితే కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాలలో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేయాగా… అప్పుడు స్వామి జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అని కూడా అంటారు.