బెంగాల్ 194/6, ఆంధ్రతో రంజీ ట్రోఫీ మ్యాచ్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్-బెంగాల్ మధ్య ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లు సత్తా చాటగా.. బెంగాల్‌ను మనోజ్ తివారి (90) పరుగులు అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. దీంతో మొదటి రోజు ఆటలో బెంగాల్ 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో పృథ్వి రాజ్, శశికాంత్ చెరో రెండు వికెట్లు తీశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు పరుగులకే ఓపెనర్ ఈశ్వరన్ (2) వికెట్‌ను పృథ్వీ రాజ్ పడగొట్టాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ అభిషేక్ కుమార్ రమన్ (6)ను శశికాంత్ పెవిలియన్ పంపాడు. ఆ కొద్ది సమయానికే సుదీప్ చటర్జీ (8) వికెట్ కూడా పడటంతో బెంగాల్ 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులో వచ్చిన అగ్నివ్‌తో కలిసి మనోజ్ తివారి బెంగాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరు నాలుగో వికెట్‌కు 113 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని ఎర్పారిచారు. అనంతరం కుదురుగా ఆడుతున్న అగ్నివ్ (106 బంతుల్లో 6 ఫోర్లతో 39) పరుగులు చేసి పృథ్వీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మనోజ్ తివారి (90; 164 బంతుల్లో 14 ఫోర్లు) విజయ్ కుమార్‌కి చక్కాడు. అనంతరం తొలిరోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ జట్టు 78 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బిజోయ్ చటర్జీ (27 బ్యాటింగ్), ప్రదిప్త ప్రామనిక్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీ రాజ్, శశికాంత్‌కు చెరో రెండు వికెట్లు లభించాయి.
ఆదుకున్న మనోజ్ తివారి
RELATED ARTICLES