సేవలకు అంతరాయం
ఉద్యోగుల సమ్మె విజయవంతం
న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణను వెంటనే అమలు చేయాలని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం స్పష్టం కనిపించి ంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా చాలా బ్యాంకుల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. వివిధ బ్యాంకులకు సంబంధించిన అనేక బ్రాంచ్‌లు బోసిపోయి కనిపించాయి. చాలా ప్రాంతాల్లో బ్యాంకు ల షెటర్స్ మూసివేసినదృశ్యాలు కనిపించాయి. బ్రాంచ్‌ల వద్ద డిపాజిట్, విత్‌డ్రా, చెక్స్ క్లియరెన్స్, డ్రాప్ట్‌ల జారీ సర్వీసులు లేకపోవడంతో కస్టమర్లు కనిపించక బ్యాంకు ల వద్ద ఎడారి చాయలు దర్శనమించాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సిలు తమ సేవలను కొనసాగించినప్పటికీ… చాలా బ్యాంకులు తమ సర్వీసులను అందించకపోవడంతో ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఇబ్బందులు తప్పలేదు.
వరుస సెలవులతో ఇబ్బందులే..
మరోవైపు శుక్రవారం బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడడమే కాకుండా మరో నాలుగు రోజుల పాటు కస్టమర్లకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 22న నాలుగోవ శనివారం, తర్వాత రోజు ఆదివారం కావడంతో బ్యాంకులు రెండు రోజుల పాటు తమ సేవలను అందించే అవకాశం లేదు. ఇక సోమవారం బ్యాంకులు తమ సేవలను కొనసాగించను న్నప్పటికీ.. మంగళవారం క్రిస్మస్ వస్తుండడంతో సేవలకు అంతరాయం ఏర్పడనుంది. 26న బ్యాంకు అధికారులు సిబ్బంది సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ రోజు కూడా బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. ఇక తిరిగి బ్యాంకుల యధావిధిగా ఈనెల 27 నుంచే తమ సేవలను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.