ఇసి దృష్టికి తీసుకెళ్తాం
22,24 తేదీల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రజాపక్షం/ హైదరాబాద్ : ఓట్ల గల్లంతు వల్లనే పార్టీ అభ్యర్థులకు మెజార్టీలు తగ్గాయని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శులతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసి ఓట్ల తొలగింపు అంశంపై చర్చిస్తుందని అన్నారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన తర్వాత కమిషన్ చేపట్టబోయే ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులకు పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో చర్చించారు. ఓటర్ గుర్తింపు కార్డులు ఉండి కూడా ఓటర్లు తమ ఓట్లు వేయలేకపోయారన్నారు. ఓటర్ల జాబితాను సవరించడమే ఎజెండా ఈ నెల 22 నుండి 24 వరకు నియోజక వర్గ విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించాలని కెటిఆర్ అన్నారు. ఈ సమావేశాలకు రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరవుతారని కెటిఆర్ తెలిపారు. ఈనెల 26 నుంచి జనవరి 6వరకు ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ శ్రేణులను ఆయన సూచించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ఓట్లు గల్లంతైన అంశం తమ ద ష్టికి వచ్చిందని, గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం పట్ల పలువురు బాధపడుతున్నారని చెప్పారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక ద ష్టి పెట్టాలని, ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో విస్త త స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలన్నారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు సంబంధించిన స్థల సేకరణ పూర్తికాగా త్వరలోనే కార్యాలయాలకు సంబంధించిన భవనాల నమూనాను పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదించిన తర్వాత, కార్యాలయాల నిర్మాణ పనులను మొదలుపెట్టాలని సమావేశంలో కెటిఆర్ నిర్ణయించారు. జనవరి మొదటి వారం నుంచి పార్టీ కార్యాలయ నిర్మాణాల పనులను ప్రారంభించాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు, ఎంఎల్‌సిలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, తుల్ల ఉమ, సత్యవతిరాథోడ్, రాములు తదితరులు పాల్గొన్నారు.