హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమేశ్వరుని తలుచుకుంటే కలిగే అనందనం అనుభూతి అనుభవిస్తేనే ఎవ్వరికైనా తెలుస్తుంది. అభిషేక ప్రియుడైన శివుడు నీళ్ళతో అభిషేకం చేసినా కూడా ఎంతగానో ప్రీతీ చెందుతాడు. శివలింగ దర్శనం సర్వపాపాలను నశింపజేస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఎండల మల్లిఖార్జునస్వామి దేవాలయం ఉంది. దీనిని కలియుగ కార్తీక కైలాసం అని అంటారు. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడున్న శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగంగా గుర్తింపు వచ్చింది.
ఈ దేవాలయం దర్శించడానికి అనేకమంది భక్తులు ఇతర ప్రదేశాలనుంచి వస్తుంటారు. అంత అద్భుతమైన శివలింగాన్ని దర్శించి పరవశించిపోతుంటారు. ప్రతీ సంవత్సరం శివరాత్రి రోజున, కార్తీక మాసంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. శివరాత్రి, కారీకమాసాలలో ఈ ఉత్సవాలను దర్శించేందుకు కొన్ని లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు…