HomeNewsBreaking Newsఆ ముగ్గురి ప్రమాణం

ఆ ముగ్గురి ప్రమాణం

రాష్ట్రాల్లో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మధ్యప్రదేశ్‌ సిఎంగా కమల్‌నాథ్‌,
రాజస్థాన్‌ సిఎంగా అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సిఎంగా భూపేష్‌ బఘేల్‌ ప్రమాణ స్వీకారం

భోపాల్‌ : కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ సోమవారం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమా ణ స్వీకారం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ సాధనకు నాయక త్వం వహించిన 72 ఏళ్ల కమల్‌నాథ్‌తో గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ సిఎంగా ప్రమాణం చేయించారు. అయితే ఈ కార్యక్రమంలో మరే ఇతర మంత్రి కూడా ప్రమాణం చేయలేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రా హుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ సీనియర్‌ నేతలంతా గం టలకొద్ది కూర్చొని సిఎం అభ్యర్థిగా చర్చలు జరిపారు. చివరగా చింద్వారా పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కమల్‌నాథ్‌ను పేరును గురువారం ప్రకటించింది. ఇది లా ఉండగా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రాహుల్‌ గాంధీ విచ్చేయగానే కార్యక్రమానికి హాజరైన అశేశ జనవాహిని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా రాహుల్‌కు కమల్‌నాథ్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ జ్యోతిరాదిత్య సింధియాలు స్వాగ తం పలికారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌, ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ ప వార్‌, ఆ పార్టీ నేత ప్రఫూల్‌ పటేల్‌, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవెగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డికు మారస్వామి, ఆంధ్రప్రదేశ్‌ సిఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకు డు దినేష్‌ త్రివేది, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌, ఆర్‌జెడి నేత తేజశ్వి యాదవ్‌లు హాజరయ్యారు. అయితే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి న బిఎస్‌పి సుప్రీం మాయావతి, ఎస్‌పి చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌లు మాత్రం హాజరు కాలేదు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్‌ కొత్త సిఎం అసోక్‌ గెహ్లాట్‌, డిప్యూటీ సిఎం సచిన్‌ పైల్‌ట్‌, హ ర్యానా మాజీ సిఎం భూపేంద్ర సింగ్‌ హుడ్డా, పుదుచ్చేరి సిఎం వి.నారాయణ స్వామి, మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌, పంజాబ్‌ మం త్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకు లు ఆనంద్‌ శర్మ, రాజ్‌ బబ్బర్‌, రాజీవ్‌ శుక్లాలు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ముగ్గురు బిజెపి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కైలశ్‌ జోషి, బాబులాల్‌ గౌర్‌లు కూడా ఆశీనులయ్యారు. కార్యక్రమానికి ముందు అన్ని మతాల పెద్ద లు కమల్‌నాథ్‌ను ఆశీర్వదించారు. వ్యాపారవేత్త అయి న మహేంద్ర నాథ్‌, లీలా దంపతులకు ఉత్తరపదేశ్‌ కా న్పూర్‌లో కమల్‌నాథ్‌ జన్మించారు. కోల్‌కతాలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక లు జరగనున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో ఆయన రాష్ట్ర పిసి సి చీఫ్‌గా నియమితులయ్యారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 230 స్థానాలకు గానూ 144 సీట్లను గె ల్చుకుంది. ఎస్‌పి (1), బిఎస్‌పి (2), నలుగురు స్వతంత్రులు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్‌ బలం 121 స్థానాలుగా ఉంది.

జైపూర్‌ : ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ సోమవారం ప్రమాణం చేశారు. డిప్యూటీ సిఎంగా రాష్ట్ర పార్టీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ నియమితులయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రతిపక్షాల బలప్రదర్శనగా మారింది. జైపూర్‌లోని చారిత్రక ఆల్బెర్ట్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ గెహ్లాట్‌తో సిఎంగా ప్రమాణం చే యించారు. సచిన్‌ పైలట్‌ మంత్రిగా ప్రమాణం చేయగా అనంతరం అతడిని గవర్నర్‌ ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సిఎం బాధ్యతల నుంచి తప్పుకుంటున్న వసుంధర రాజె ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అదే విధంగా నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ చీప్‌ శరద్‌ పవార్‌, టిడిపి అధినేత, ఎపి సిఎం ఎన్‌. చంద్రబా బు నాయుడు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అ బ్దుల్లా, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జెడి) నేత తేజస్వి యా దవ్‌, జనతా దళ్‌ (సెక్యులర్‌) అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వా మి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) సెమంత్‌ సోరెన్‌, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (జెవిఎం) నేత బాబులాల్‌ మా రండిలు కూడా పాల్గొన్నారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీ అని ఆదివారం ప్రతిపాదించిన డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ కూడా హాజరయ్యా రు. కాగా, ముఖ్యమంత్రి పదవిని మూడు సా ర్లు చేపట్టిన నాయకుల్లో గెహ్లాట్‌ నాల్గొవ నాయకుడు. మొదటిసారిగా ఆయన 1998లో సిఎం పదవిని చేపట్టగా, 2008లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు తలపాగాను ధరించనని 2014 లో ప్రతిజ్ఞ చేసినట్లుగానే సచిన్‌ పైలట్‌.. కాంగ్రెస్‌ పార్టీ విజయానికి సూచికగా సంప్రదాయక తలపాగాను ధరించారు. పైలట్‌, గెహ్లాట్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్ర మాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడంతో వేదిక కిక్కిరిసిపోయింది. అనేక మంది ఎంఎల్‌ఎలు, సీనియర్‌ నాయకులు వారికి కేటాయించిన సీట్ల వద్దకు మద్దతుదారులను తోచుకొని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎంఎల్‌ఎ బిడి కల్లా, స్వతంత్ర ఎంఎల్‌ఎ బాబుబాల్‌ నగర్‌తో పాటు మరి కొంత మంది వారి స్థానాల్లోకి వెళ్లడానికి ముందే రిద్దీలో ఇరుక్కుపోయారు. సచిన్‌, గెహ్లాట్‌ మద్దతుగా పార్టీ కార్యకర్తలు కు ర్చీల పైకి ఎక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముందు గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌, ఇతర నాయకు లు రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌కు జైపూర్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి అందరూ కలిసి ఆల్బెర్ట్‌ హాల్‌ వద్దకు చేరుకున్నారు. అయితే ఈ హాలుల్‌ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి.

రాయ్‌పూర్‌ : ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ నేత భూపేష్‌ బఘేల్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిఎం పదవికి పోటీ పడిన ఎంఎల్‌ఎలు టిఎస్‌ సింగ్‌ దేవ్‌, తమ్రాద్‌వాజ్‌ సాహు మంత్రులుగా ప్రమాణం చేశారు. బాల్బీర్‌ జునేజ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ బఘేల్‌తో సిఎంగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌, డిప్యూటీ సిఎం సచిన్‌ పైలట్‌, పుదుచ్చేరి సిఎం వి. నారాయణస్వామి, ఎంపి జ్యోతిరాదిత్య సింధియా, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌లు హాజరయ్యారు. అదే విధంగా తాజా మాజీ సిఎం రమన్‌సింగ్‌కు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ లెజిస్‌ల్లేటర్‌ పార్టీ నేతగా ఐదుసార్లు ఎంఎల్‌ఎ అయిన భూపేష్‌ బఘేల్‌ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2013లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం బఘేల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి భారీ విజయాన్ని అందించారు. 90 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ పార్టీ 68 సీట్లలో గెలుపొందింది. 2003లో అధికారంలోకి వచ్చిన బిజెపి ఈసారి కేవలం 15 స్థానాలను మాత్రమే గెల్చుకుంది. అయితే వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపిని ఓడించడంలో బఘేల్‌ కీలక పాత్ర పోషించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments