వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ క్రికెటర్ టామ్ లాథమ్ టెస్టు క్రికెట్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో పరుగుల సునామీ సష్టించాడు. అతని దెబ్బకు లంక కుదేలైపోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన లాథమ్ మొత్తం 489 బంతులు ఆడి 21ఫోర్లు, సిక్స్ సాయంతో 264 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరోచిత పోరాటంతో లంక బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో తన జోరు తగ్గించలేదు. కివీస్ ఇన్నింగ్స్ ముగిసేవరకు క్రీజులో ఉన్న లాథమ్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతన్ని ఔట్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా చిన్న అవకాశం కూడా ఇవ్వలే దు. ఓర్పు, సహనంతో ఆచితూచి బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్‌కు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 578 పరుగులు చేస్తే.. లాథమ్ ఒక్కడే 264 పరుగులు చేశాడు. అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ సహకరిస్తే అలవోకగా 300 మార్క్‌ను అందుకునేవాడు. లంక బౌ లర్ లాహిర్ కుమారా బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఔటవడంతో కివీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగుల ఆధిక్యం ల భించింది. టామ్ దెబ్బకు లంక ఆటగాళ్లు ఉక్కిరిబిక్కి అ య్యారు. మూడో రోజు ఆటముగిసేసరికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 20 పరుగులు చేసింది. లంక ఇంకా 276 పరుగులు వెనకబడి ఉంది. స్వల్ప స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లంక అనూ హ్య ప్రదర్శన చేస్తే తప్ప ఓటమి నుంచి తప్పించుకోలేదు. కివీస్ మిగిలిన ఏడు వికెట్లు పడగొడితే సిరీస్‌లో 1- ఆధిక్యం సంపాదించనుంది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 282 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
టామ్ లాథమ్ డబుల్ సెంచరీ!
RELATED ARTICLES