పెర్త్: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 214 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ నమోదు చేసుకున్నాడు. టె స్టుల్లో కోహ్లీకి ఇది 25వ శతకం కవాడం విశేషం. మరోవైపు టెస్టుల్లో వేగంగా 25 శతకాలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ మరో రికార్డును సాధించాడు. కోహ్లీ కంటే ముందు దిగ్గజ క్రికెటర్ బ్రాడ్‌మన్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా, భారత్ తరఫును ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును తాజాగా కోహ్లీ సమం చేశాడు. అనంతరం విహారీతో కలిసి ఐదో వికెట్‌కు కీలమైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ కొద్ది సేపటికే కుదురుగా ఆడుతున్న విహారి (20; 46 బంతుల్లో 2 ఫోరు)ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. తర్వాత కోహ్లీ, పంత్ భారత ఇన్నింగ్స్‌ను ముం దుకు నడిపించారు. కానీ, ఈ సమయంలోనే పెద్ద షాక్ తగిలింది. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న కెప్టెన్ కోహ్లీని కమ్మిన్స్ తెలివైన బంతితో పెవిలియన్ పంపాడు. చిరస్మరణీ య ఇన్నింగ్స్ ఆడిని విరాట్ కోహ్లీ 257 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 123 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. కా నీ, ఇతనికి మరోఎండ్ నుంచి సహకారం అందలేకపోయింది. మరోసారి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ నిరాశపరిచా రు. లియన్ ధాటికి మహ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (1), బుమ్రా (4) వెనువెంటనే వికెట్లు కోల్పోయారు. దూకుడుగా ఆడుతున్న పంత్ (36; 50 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా లియాన్ బౌ లింగ్లో నే వెనుదిరిగాడు.
కోహ్లీ రికార్డు శతకం

RELATED ARTICLES