శ్రీలంక 275/9, న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, శ్రీలంక మధ్య శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో శ్రీలంక మొదటి రోజు ఆటలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్స్‌లో అంజెలో మాథ్యుస్ (83), దిముత్ కరుణరత్నే (79) అర్ధ శతకాలతో రాణించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆరంభం కలిసి రాలేదు. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో దనుష్క గునతిలక (1), డిసిల్వా (1), కుశాల్ మెండిస్ (2) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో లంక 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత దిముత్ కరుణరత్నే, అంజెలో మాథ్యుస్ అద్భుతమైన బ్యాటింగ్‌తో లంక ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కీలకమైన 133 పరుగులు కూడా జోడించారు. తర్వాత కుదురుగా ఆడుతున్న ఓపెనర్ కరుణరత్నే (79; 144 బంతుల్లో 11 ఫోర్లు) వాంగర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత పుంజుకున్న కివీస్ బౌలర్ టిమ్ సౌథి చెలరేగి పోయాడు. నిప్పులు చెరిగే బంతులతో వరుసక్రమంలో వికెట్లు తీస్తూ లంక బ్యాట్స్‌మెన్స్‌ను హడలెత్తించాడు. ఇతని ధాటికి అప్పుడు క్రీజులోకి వచ్చిన శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ (6) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత మరో కీలక బ్యాట్స్‌మన్ అంజెలో మాథ్యుస్ (83; 153 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా సౌథి భౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. 187 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ లంకను చివర్లో వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. బౌలర్ల అండతో లంక ఇన్నింగ్స్‌ను ముందుకు సాగిస్తూ తమ జట్టును తిరిగి పటిష్ట స్థితికి చేర్చాడు. శనివారం మొదటి రోజు ఆటముగిసే వరకు అజేయంగా ఉన్న డిక్వెల్లా 91 బంతుల్లో 10 ఫోర్లతో 73 పరుగులు చేశాడు. దీంతో శ్రీలకం 87 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో చెలరేగి బౌలింగ్ చేసిన టిమ్ సౌథి 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో నెల్ వాంగర్కి రెండు, ట్రెంట్ బోల్ట్, గ్రాండ్‌హోమ్‌కు చెరొక్క వికెట్ లభించింది.
మాథ్యూస్, కరుణరత్నే అర్ధ శతకాలు
RELATED ARTICLES