హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల్లో ఉంటూ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు పార్టీనేతలు పోరాటం చేయాలన్నారు. బిజెపికి 105 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని, మళ్లీ ఎంపీ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని పోటీ చేస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ హవా నడుస్తోందని, రాబోయే స్థానిక, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని పేర్కొన్నారు.
సమస్యలపై నిరంతర పోరాటం
RELATED ARTICLES