నాకౌట్‌కు సమీర్‌వర్మ,
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ
గ్వాంగ్‌జౌ (చైనా): భారత స్టార్ షట్లర్లు పివి సింధు, సమీర్ వర్మలు బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించారు. ఒలింపిక్ రజతపతక విజేత సింధు హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన సమీర్ వర్మ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి నాకౌట్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తెలుగు తేజం పివి సింధు 21-9, 21-15 తేడాతో ప్రపంచ 12వ ర్యాంకర్ బివెన్ జాంగ్ (అమెరికా)ను వరుస గేమ్‌లలో చిత్తు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి ప్రపంచ నెంబర్‌వన్ తైజు యింగ్‌ను మట్టికరిపించిన సింధు అదే ఉత్సాహాంను శుక్రవారం జరిగిన తన మూడో మ్యాచ్‌లో కూడా కనబరిచింది. ఆరంభం నుంచే దుకుడును ప్రదర్శించిన సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో సింధు తన ప్రత్యర్థిని పుంజుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే ఏకపక్షంగా 21-9తో ఈ గేమ్‌ను గెలుచుకుంది. తర్వాతి గేమ్‌లో అమెరికా క్రీడాకారిణి కొద్ది వరకు పోటీ కనబరిచిన చివరికి సింధుపై చెయ్యి సాధించింది. ప్రత్యర్థిపై వరుస దాడులు చేస్తూ 21-15తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. దూకుడుగా ఆడిన సింధు ఈ మ్యాచ్‌ను 35 నిమిషాల్లోనే ముగించేసింది. భారత స్టార్ సింధు ఈ సీజన్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో వరుసగా మూడో విజయం సాధించి సంచలనం సృష్టించింది. తొలి మ్యాచ్‌లో జాపాన్ స్టార్ అకానె యామగుచిపై విజయం సాధించిన సింధు రెండో మ్యాచ్‌లో చైనీస్ తైపి తైజు యింగ్‌ను చిత్తు చేసింది. తాజాగా మూడో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన బివెంగ్ జాంగ్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్లో దూసుకెళ్లింది.
సమీర్‌కు వరుసగా రెండో విజయం…
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ సమీర్ వర్మ వరుసగా రెండో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో సమీర్ వర్మ (భారత్) 21-9, 21-18తో థాయ్‌లాండ్‌కు చెందిన కాంటాఫాన్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న సమీర్ వర్మకు రెండో గేమ్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. చివర్లో పుంజుకున్న సమీర్ దూకుడును ప్రదర్శిస్తూ ఈ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. ఓటమితో టోర్నీని ఆరంభించిన సమీర్ వర్మ ఆ తర్వాత పుంజుకున్నాడు. టైటిల్‌పై తన ఆశలను సజీవంగా ఉంచుకుంటూ మెరుగైన ఆటతో వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి సెమీలో ప్రవేశించాడు.