పెర్త్ : కేవలం బ్యాటింగ్‌కే పరిమితమనుకున్న భారత యువ బ్యాట్స్‌మన హనుమ విహారీ ఆస్ట్రేలియాతో రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు రెండు వికెట్లు తీసుకొని కలకలం సృష్టించాడు. హనుమ విహారీ ఇలా బంతితో వీరవిహారం చేస్తాడని ఊహించలేదు. 14 ఓవర్లు బౌలింగ్ చేసిన విహారీ 1 మేడిన్ ఓవర్‌తో 53 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ రెండు వికెట్లు కూడా కీలకమైన మార్కస్ హారిస్, షాన్మార్ష్లకు చెందినవి. ఆఫ్ స్పిన్నర్ అయిన హనుమ విహారీ పేసర్లకు రిలీఫ్‌గా బౌలింగ్ చేపట్టాడు. విహారీకి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లోనే మార్కస్ హారిస్ వికెట్టు మొదటిది. విహారీకి బౌలింగ్ ఇవ్వాలన్న కోహ్లీ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు ప్రశంసించారు.