హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని బిఎస్పి అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. శుక్రవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను కలిశారు. తమ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారులు కెటిఆర్ ఆదేశాల మేరకు నడుచుకున్నారని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టిఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మొబైల్ ఫోన్‌తో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చారని తెలిపారు. 18వ రౌండ్ నుంచి తన మెజార్టీ తగ్గించారని, న్యాయంగా గెలవని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్నినిలిపివేయాలని మల్రెడ్డి ఇసిని కోరారు. తనకు ఎన్నికల కమిషన్ న్యాయం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిన అభ్యర్థులమంతా కలిసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల్లో బిఎస్పి అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య తీవ్ర ఉత్కంఠ పోరు కొనసాగింది. చివరకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 376 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డికి 72,581 ఓట్లు రాగా.. మల్రెడ్డి రంగారెడ్డికి 72,205 ఓట్లు వచ్చాయి.
రీ కౌంటింగ్ నిర్వహించండి
RELATED ARTICLES