సాక్షిగా జరిగిన అత్తాపూర్, నయాపూల్ హత్యలు ఆగేవి
ఆందోళన కారులపైనే లాఠీల ప్రతాపం
అడ్డుకునే సమయంలో కనిపించని వైనం
ప్రజాపక్షం/హైదరాబాద్ : 26న అత్తాపూర్‌లో నడిరోడ్డుపై రమేష్ (39) అనే వ్యక్తిని పోలీసుల కళ్లముందే హంతకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపా డు… 28న నయాపూల్ వద్ద నడిరోడ్డుపై పోలీసుల ముందే ఆటో డ్రైవర్ షాకీర్ ఖురేషీ (30)ను హంతకుడు గొంతు కోసి అతి కిరాతకంగా చంపాడు. ఈ రెం డు ఘటనలు కూడా పట్టపగలు పోలీసుల కళ్ల ముందే చోటుసుకున్న ఘోరాలు. నిజానికి ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న పోలీసుల వద్ద లాఠీ ఉంటే ఈ రెండు హత్యలు అడ్డుకునే వారు. వారి వద్ద లాఠీలు లేకపోవడంతో హం తకులను అడ్డుకోలేక పోయారు. ఆ సమయంలో పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఇంతలో జరగరాన్ని ఘోరం జరిగిపోయింది. గతంలో పోలీసు శాఖలో విధులు నిర్వహించే పోలీసుల వద్ద లాఠీ, పోలీసు విజిల్ తప్పనిసరిగా ఉండేది. కంటికి కనిపించే దూరంలో ఏదైనా గొడవ జరిగితే పోలీసులు తమ బుజానికి ఉన్న విజిల్‌ను ఉపయోగించడంతో.. వస్తున్నారనే భయంతో గొడవ పడే వారు పారిపోయేవారు. దీంతో జరిగే ఘోరాన్ని కొంతమేరకైనా ఆపగలిగేవారు. ఇక తమ ముందే ఏదైనా ఘోరం జరిగితే పో లీసులు తమ వద్ద ఉన్న లాఠీకి పనిచెప్పి ఆపగలిగేవారు. అయితే పోలీసు శాఖలో పదేళ్ల నుంచి సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పోలీసులు కూడా పాత పద్ధ్దతులకు స్వస్తి పలుకారు. లాఠీల స్థానంలో వారికి స్మార్ట్‌ఫోన్‌లు, ఐప్యాడ్‌లు వచ్చేసాయి. ఏ ఘోరం జరిగినా ఫోటోలు తీయడం, లేదా ఫోన్ ద్వారా పై అధికారులకు సమాచారం ఇవ్వడం కోసమే అది పనికొస్తుంది. అయితే జరిగే ఘోరాన్ని ఆపడానికి ఆ సెల్‌ఫోన్ పనిచేయదు. ఖాకీ డ్రెస్ వేసుకుని లాఠీ పట్టుకు ని.. విజిల్ ఉంటే ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే కాస్త ధైర్యం ప్రదర్శిస్తే కాస్తున బాధితులకు ఊరట అందించడానికి వీలు కలుగుతుంది. అయి తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులు లాఠీలు వాడడం లేదు. పోలీసు చేతి లో లాఠీలు ఉండకూడదని కోర్టులు తీర్పులు ఇవ్వలేదు. మరీ లాఠీలను ఉన్నతాధికారులు ఎందు కు మరిచారో తెలియదు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకున్నా కొన్ని పాత పద్ధతులను మరవరాదని పలువురు అంటున్నారు.
అత్తాపూర్ ఘటన..
తన భార్యతో వివాహేతర సం బంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఎనిమిది నెలల క్రితం మహేష్ గౌడ్ (25) అనే యు వకుడిని రమేష్ హత్య చేశాడు. ఈ కేసు లో సెప్టెంబర్ 26న అత్తాపూర్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న రమేష్‌పై మహేష్ తండ్రి, మరో బంధువు పట్టపగలు నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపారు. ఆ సమయంలో అక్కడ కనీసం నలుగురు పోలీసులు ఉన్నారు. వారి వద్ద లాఠీలు లేవు. చేతులతో ఆపేందుకు ప్రయత్నించారు. అయితే హంతకుడి వద్ద గొడ్డలి ఉండడంతో భయపడి పోయి వెనుకంట వేశారు. ఇంతలో జరగరాని ఘోరం జరిగింది. ఆ సమయంలో పోలీసుల వద్ద లాఠీ ఉంటే హంతకుడి వద్ద గొడ్డలి ఉన్నా ఎదుర్కొని హత్యను ఆపేవారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నయాపూల్‌లో అదే పరిస్థితి…
తన చెల్లిని, తల్లిని తిట్టాడనే కోపంతో నవంబర్ 28న నయాపూల్ వద్ద పట్టపగలు తోటి ఆటో డ్రైవర్ చంచల్‌గూడకు చెందిన షాకీర్ ఖురేషి (30) ని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ సమయంలో కూడా నలుగురైదుగురు పోలీసులు అక్కడ విధుల్లో ఉన్నారు. వారు ఘోరాన్ని ఆపేందుకు ధైర్యం చేయలేక పోయారు. ఎందుకంటే హంతకుడి వద్ద ఉన్న కత్తిని చూసి భయపడి పో యారు. ఇక్కడ కూ డా పోలీసుల వద్ద లాఠీలు లేవు. ఉండివుంటే హంతకుడిపై దాడి చేసేవారు.
ఆందోళన కారులపై లాఠీలు ఝులిపిస్తారు రౌడీలు, గుండాలు, దోపిడి దొంగలు, స్నాచర్లు, అల్లరి మూకలపై ఝులిపించాల్సిన పోలీసు లాఠీ ఇప్పుడు… తమ న్యాయమైన సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న బాధితులపై పోలసులు లాఠీలు ఝులిపిస్తున్నా రు. లాఠీ చార్జీలలో చాలా మంది గాయపడడం, మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏ పాపం చేయకు న్నా లాఠీ చార్జీలో గాయపడి మరణించిన బాధితులు కూ డా ఉన్నారు. నడిరోడ్డుపై నేరస్తులు రెచ్చిపోతున్నా వారి పై లాఠీలు ఉపయోగించడం లేదు. కేవలం ప్రభత్వాన్ని ఎవరైతే నిలదీసి ప్రశ్నిస్తారో వారిని మాత్రం రాత్రికి రాత్రి వారింటిపై వందల లాఠీలతో దాడుల కు తెగబడుతున్నారు. ఇక పలానా చోట నిరసన కార్యక్రమాలు జరుగాతయని తెలియగానే వందలాది మంది పో లీసులు మూలనపడ్డ లాఠీలను తీసుకుని విధులు నిర్వహిస్తారు. ఆ సమయంలో హోంగార్డు నుంచి ఎస్‌పి స్థా యి వరకు అధికారి చేతిలో లాఠీలు ఉంటాయి. నేరాలు జరిగే సమయంలో మాత్రం పోలీసులు లాఠీలను మూ లన పడేస్తున్నారు. వాటికి పనిచేప్పడం లేదు.అమాయకులపై ప్రయోగించే లాఠీలను ఇప్పటికైనా నేరస్తులపై ప్ర యోగించి హత్యలు, దోపిడీలు, స్నాచింగ్‌లు, దాడులను అరికట్టమని పలువురు పోలీసు ఉన్నతాధికారులను కో రుతున్నారు. విధులు నిర్వహించే ప్రతి పోలీసు వద్ద లా ఠీ, విజిల్ తప్పనిసరిగా ఉంటే నేరస్తులో భయంతో పాటు నేరాలను అదుపు చేయవచ్చంటున్నారు. కేవలం సిసిటివిలపైనే పోలీసులు ఆధారపడి విధులు నిర్వహిస్తున్నారు లాఠీ చేతిలో ఉంటే నేరస్తులకు భయం ఉంటుందని, నేరం చేసేందుకు సాహసించడని పలువురు అభిప్రాయపడుతున్నారు.