న్యూఢిల్లీ: కాంగ్రెస్ గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ఆలస్యమయ్యేలా కనబడుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో యువనేతలు, సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొం ది. ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎన్నికచేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సోని యా గాంధీ సహా సీనియర్ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ అధికార నివాసం కాస్తా రివాల్వింగ్ డోర్‌లా మారింది. కీలకమైన మూడు హిందీ రాష్ట్రాల సిఎం పోస్ట్‌లకు నలుగురు అభ్యర్థులు, ఎఐసిసి పర్యవేక్షకులు పోటీపడుతున్నారు. ‘ఇద్దరు శక్తిమంతమై న యోధులు సహనంతో, సమయం కోసం వేచి ఉన్నా రు’ అని రాహుల్ గాంధీ లియో టాలస్టాయ్ మాటలను ట్వీట్ చేశారు. దాంతోపాటు మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ప్ర ధాన పోటీదారులు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌తో కలసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. సిఎం విషయ మై మంతనాలు జరుగుతున్న తరుణంలో రాహుల్ ఇం టిని ప్రియాంక గాంధీ సందర్శించారు. అయితే ఆ చర్చ ల్లో ఆమె పాల్గొన్నారా లేదా అన్నది రూఢీ కాలేదు. ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో పోటీపడుతున్న వివిధ నాయకుల మద్దతుదారులు నినాదాలు చేశారు. ఉద్రిక్తత నెలకొంది. రాజస్థాన్‌లోని కొన్ని చోట్ల చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్‌లో సచిన్ పైలట్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ సిఎం పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు తమ పార్టీ మద్దతుదారులను శాంతంగా, క్రమశిక్షణతో ఉండాలని కోరారు. పైగా తమకు పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉందని, పార్టీ నాయకత్వం తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడతామని చెప్పారు. సిఎం అభ్యర్థుల పేర్లు ఖరారు చేసేందుకు సచిన్ పైలట్, గెహాట్, సింధియా, కమల్‌నాథ్‌లతో పార్టీ అధినేత రాహుల్ గాంధీ విడివిడిగా సమావేశమయ్యారు. అంతకుముందు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పరిశీలకులతోనూ చర్చించిన రాహుల్ ఎంఎల్‌ఎల అభిప్రాయంపై ఆరా తీశారు. ప్రత్యేక యాప్ ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఎఐసిసి ఇన్‌ఛార్జి అవినాశ్ పాండే విషయాలను రాహుల్ గాంధీకి వివరించాక విలేకరులతో మాట్లాడుతూ ‘పార్టీ ఎంఎల్‌ఎల అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి వివరించాం. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది చివరికి ఆయనే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని జైపూర్‌లో జరిగే లెజిస్లేచర్ పార్టీ మీటింగ్‌లో ప్రకటించడం జరుగుతుంది’ అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో గెలిచిన ఎంఎల్‌ఎలు ‘ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారం రా హుల్ గాంధీదే’ అని ఏకవాక్య తీర్మానం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఒకరిగా ఉన్న పిసిసి అధ్యక్షుడు భూపేశ్ బఘేల్(57) ఇంటి బ యట ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆయనతోపాటు సిఎల్‌పి నేత టి ఎస్ సింగ్ దేవ్(66), ఒబిసి నాయకుడు తమ్రదాజ్ సాహు(69), పార్టీ సీనియర్ నాయకుడు చరణ్ దాస్ మహంత్(64) సిఎం పదవిని ఆశిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్(67), కమల్‌నాథ్(72)ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే మంచిదని, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతుండగా, యువనాయకులైన జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్‌లను ముఖ్యమంత్రులను చేయాలని, తద్వారా మార్పు సందేశం దేశమంతా వ్యాపిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కేంద్ర ప ర్యవేక్షులు- కెసి వేణుగోపాల్(రాజస్థాన్), ఎకె ఆంటోని(మధ్యప్రదేశ్)తో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో కొత్తగాఎన్నికైన ఎంఎల్‌ఎల అభిప్రాయాలు ఎలా ఉన్నాయ ని వారిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాక రాహుల్ వేర్వేరుగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలతో భేటీ అయ్యారు. ‘పార్టీలోని అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. ఎంఎల్‌ఎలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ, ఇతరులు ఎమనుకుంటున్నారన్న విషయంపై సమగ్రమైన సమాధానాలు రాబట్టుతున్నాం’ అని రాహుల్ గాంధీ పార్లమెంటు బయట విలేకరులకు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌కు పార్టీ కేంద్ర పర్యవేక్షకుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఆ రాష్ట్ర ఎంఎల్‌ఎల అభిప్రాయాలను రాహుల్ గాంధీకి వివరించాక ఛత్తీస్‌గఢ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారని అధికార వర్గాలు చెప్పాయి. ఇప్పటికీ ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. తమ నాయకులనే సిఎంను చేయాలన్న నినాదాలు, ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో కాంగ్రెస్ తొలి పరీక్షను ఎదుర్కొంటున్నట్లుగా ఉంది. రాహుల్ గాంధీ సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. కాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.
కొనసాగుతున్న భేటీలు, చర్చోపచర్చలు
RELATED ARTICLES