మహేశ్ బాబు సినిమాలంటే అభిమానులు ధియేటర్లకు ఎగపడతారు.. హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా క్యూ కట్టి మరీ చూస్తారు. అందుకే మహేశ్‌తో సినిమా చేయాలని టాలీవుడ్ ప్రడ్యూసర్లు, డెరెక్టర్లందరూ ఆయన కాల్షిట్ల కోసం మహేశ్ వద్ద క్యూ కడతారు. కాగా, ప్రస్తుతం త్వరలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా మహేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో ఉన్న మహేష్ తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పారు. ఆ సినిమా తరువాత అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే సందీప్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. తరుచూ సందీప్, మహేష్‌లు కలిసి కనిపిస్తుండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే ఉంటుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరో.. ఇక వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలు చేస్తున్న ప్రస్తుసర్ కలిసి సినిమా చేస్తే.. ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిపోవడం సాధరణమే..
మెగా ప్రొడ్యూసర్‌తో మహేశ్ సినిమా..!
RELATED ARTICLES