భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టు నేటి నుంచే
కొత్త మైదానం.. ఇరుజట్లకూ కొత్తే!
పెర్త్ : భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారంనాడు పెర్త్‌లోని సరికొత్త వేదిక ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే 1- ఆధిక్యతలో వున్న టీమిండియా పెర్త్ టెస్టు విజయంతో ఆధిక్యతను పెంచుకోవాలని ప్రయత్నిస్తుండగా, స్వదేశీగడ్డపై పూర్వవైభవాన్ని పొందడానికి పుంజుకునే పనిలో కంగారూలు వు న్నారు. ఆడిలైడ్‌లో గత వారం జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించిన విషయం తెల్సిందే. తొలి టెస్టు విజయం కోహ్లీసేనకు చారిత్రాత్మకమైనది. ఈ మ్యాచ్‌లు నాలుగు ఇన్నింగ్స్‌లు పూర్తిగా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 235 పరుగులు మాత్రమే చేసింది. దీంతో అక్కడే 15 పరుగులు వెనుకబడిపోయింది. ఆ తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 291 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత్ ఓవరాల్‌గా 31 పరుగులు ఆధిక్యత చూపింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ హోరాహోరీగా సాగింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించి మరీ ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. దీంతో టీమిండియాకు చారిత్రాత్మక విజయం సిద్ధించింది. సిరీస్‌ను సమం చేయాలంటే పెర్త్ టెస్టులో విజయం సా ధించాల్సిన పరిస్థితి ఆసీస్‌కు దాపురించింది. ఈ టెస్టులోనూ ఆసీస్ ఓ డినపక్షంలో మిగతా రెండు టెస్టుల్లో తీవ్రమైన టెన్షన్‌ను చవిచూడాల్సివుంటుంది. వ్యూహాత్మకంగా పెర్త్ టెస్టులో గెలవాలని ఆశిస్తున్నది.
గెలుపే లక్ష్యంగా..!
RELATED ARTICLES