ప్రపంచ నెంబర్వన్ను ఓడించిన హైదరాబాదీ
గ్వాంగ్జూ : ఒలింపిక్ రజత పతక విజేత పి.వి.సింధు కోరిక ఎట్టకేలకు సిద్ధించింది. ప్రపంచ నెంబర్‌వన్ తై జూ యింగ్‌పై విజయం సాధించాలన్న ఆమె ప్రయత్నం ఫలించింది. బిడబ్ల్యుఫ్ వరల్డ్‌టూర్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ టోర్నమెంటులో భాగంగా గురువారంనాడిక్కడ జరిగిన గ్రూప్-ఎ హోరాహోరీ మ్యాచ్‌లో పి.వి.సింధు 14 21- 21 తేడాతో చైనీస్ తైపేకి చెందిన త్సూ యింగ్‌పై ఘన విజయం సాధించింది. రియో ఒలింపిక్స్ తర్వాత ఆసియా క్రీడల విజేత త్సూ యింగ్‌పై సింధుకు ఇదే తొలి విజయం. ప్రతిసా రీ ప్రతి టోర్నీలోనూ ఫైనల్స్‌లో అడ్డంకిగా మారిన తై జూ యిం గ్ను ఈసారి ఆరంభంలోనే సింధు ఇంటికి పం పించేసింది. అయి తే తొలి సెట్లో సింధు ఓడిపోయేసరికి ఆమె ఇంటిముఖం తప్పదని అనుకున్నారు. కానీ సింధు అనూహ్యంగా పుంజుకొని అద్భుతమైన ఆటతీరుతో మిగిలిన రెండు సెట్లలోనూ అద్వితీయమైన విజయాన్ని సాధించింది. త్సూ యింగ్ ఈ పరాజయాన్ని ఊహించలేకపోయింది. వాస్తవానికి తొలి సెట్ హోరాహోరీగానే సాగింది. అయితే క్లిష్టపరిస్థితుల్లో సింధు ఆ సెట్‌ను కోల్పోవలిసి వచ్చింది. ఇక రెండు సెట్లో పుంజుకున్న సింధు గెలిచిన తర్వాత మూడో సెట్ నిర్ణయాత్మకంగా మారిపోయింది. ఇరువురి మధ్య ఈ ఆఖరి సెట్లో పోటాపోటీ తప్పలేదు. చివరకు సింధునే విజేతగా నిలిచి ంది. సింధు కొట్టిన కొన్ని డిలైటెడ్ షాట్లు ఆకట్టుకున్నాయి.
సమీర్‌వర్మ ముందంజ
ఇదిలావుండగా, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సమీర్‌వర్మ మరో ముందడుగు వేసి నాకౌట్‌పై ఆశలు రేకెత్తించాడు. అతను గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో 21 21 తేడాతో పదవ నెంబర్ ఆటగాడు సుగియార్తోపై తిరుగులేని విజయం సాధించాడు. సమీర్ ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 14లో వున్నాడు. 24 ఏళ్ల సమీర్ తన కన్నా ఉత్తమ ర్యాంకర్ సుగియార్తోను ఎంతో పద్ధతిగా ఓడించాడు. శుక్రవారంనాడు జరిగే తన తదుపరి మ్యాచ్ థాయ్‌లాండ్ ఆటగాడు కాంటాఫోన్ వాంగ్చెరియన్తో తలపడతాడు.
సింధు సంచలన విజయం!
RELATED ARTICLES