న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి గురువారం నాటికి 17ఏళ్లు అయిన సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో అమర వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరై అమరులైన పోలీసులు, జవాన్లకు అంజలి ఘటించారు. అయితే ఈ కార్యక్రమంలో మోడీ, రాహుల్ తక్కువ దూరంలో కూర్చున్నప్పటికీ కనీసం మాట్లాడుకోలేదు. కాగా.. మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్‌ను మాత్రం మోడీని పలకరించారు. మరోవైపు కేంద్రమంత్రులు విజయ్ గోయల్, రామదాస్ అథవాలే రాహుల్‌గాంధీతో కరచాలనం చేశారు.
పలకరించుకోని మోడీ, రాహుల్
RELATED ARTICLES